Bajrang Punia : ఢిల్లీలో హైడ్రామా.. 'పద్మశ్రీ'ని వెనక్కి ఇచ్చేందుకు మోదీ ఇంటికి వెళ్లిన పూనియా.. తర్వాత ఏం జరిగిందంటే?

రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష ఎన్నికల్లో బ్రిజ్ సన్నిహితుడైన సంజ‌య్ గెలవడంతో రెజర్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నట్టు రెజ్లర్ బజరంగ పూనియా మోదీకి ట్వీట్ చేశారు. అంతేకాదు నేరుగా మోదీ ఇంటికి వెళ్లేందుకు పూనియ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Bajrang Punia : ఢిల్లీలో హైడ్రామా.. 'పద్మశ్రీ'ని వెనక్కి ఇచ్చేందుకు మోదీ ఇంటికి వెళ్లిన పూనియా.. తర్వాత ఏం జరిగిందంటే?
New Update

Sanjay Singh : రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడైన సంజ‌య్ సింగ్(Sanjay Singh) గెలుపొందడంతో ఆగ్రహంతో ఉన్న రెజ్లర్ బజరంగ్ పునియా(Bajarang Punia) షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. ప్రధాని మోదీకి లేఖ రాస్తూ పద్మశ్రీ అవార్డును వాపస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో, ఎలా జీవించాలో అర్థంకాక రాత్రంతా ఏడుస్తూ గడిపానని పూనియా తన లేఖలో పేర్కొన్నారు. ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ పునియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పద్మశ్రీ అవార్డును వాపస్ చేస్తున్నట్టు సమాచారం ఇచ్చాడు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు సన్నిహితుడైన వ్యక్తి ఎన్నికల విజయంపై బాధపడ్డట్లు మోదీకి రాసిన లేఖను పోస్ట్ చేశాడు. భారత రెజ్లింగ్ ఫెడరేషన్‌లో నియంతృత్వంగా వ్యవహారిస్తున్న ఆరోపణులు ఎదుర్కొంటున్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌. అతడిపై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్ల ఫిర్యాదుపై క్రీడా మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యం కారణంగా బజరంగ్ పునియా 'పద్మశ్రీ'ని తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ రాశారు.

ఫుట్‌పాత్‌పైనే పెట్టి వెళ్లిపోయారు:
సోషల్‌మీడియా వేదికగా పద్మశ్రీని వాపస్‌ ఇస్తున్నట్టు ప్రకటించిన పూనియా ఆ వెంటనే ప్రధాని మోదీ ఇంటికి బయలుదేరాడు. అయితే ప్రధాని నివాసానికి చేరుకోకముందే ఢిల్లీ పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అక్కడ నుంచి పూనియాను కదలనివ్వలేదు. దీంతో పద్మశ్రీని ఫుట్‌పాత్‌పై పెట్టేశారు బజరంగ పూనియా. నిజానికి భారత రెజ్లింగ్ సమాఖ్యలో కొనసాగుతున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిరంకుశత్వం, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఈ ఏడాది(2023) ప్రారంభం నుంచి భారత రెజ్లర్లలో ఒక వర్గం నిరసనలు తెలుపుతోంది. బ్రిజ్ భూషణ్ మహిళా మల్లయోధులను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఉన్నాయి. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బీజేపీ ఎంపీ. చాలా కాలం పాటు ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.


ఒకరి తర్వాత ఒకరు:
ఇక సంజయ్‌ సింగ్‌ అధ్యక్షుడు కావడంతో ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ ను వదిలేస్తున్నట్టు ఎంతో బాధతో చెప్పారు. తామంతా 40 రోజుల పాటు రోడ్డెక్కి ధర్నా చేస్తే దేశమంతా తమకు తోడుగా నిలిచిందని, అయినా, అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓడిపోవడం బాధ కలిగించిందని చెప్తూ సాక్షి భావోద్వేగానికి లోనయ్యారు. బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి గెలిచారంటూ సాక్షి మాలిక్ కంట నీరు పెడుతూ మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు. రెజ్లింగ్ స‌మాఖ్య అధ్యక్షుడిగా సంజ‌య్ సింగ్ ఎన్నికతో దేశంలో ఆ క్రీడ భ‌విష్యత్తును అంధ‌కారంలోకి తీసుకెళ్లిందన్నారు వినేశ్ పోగాట్. అయితే సంకల్ప బలాన్నే నమ్ముకున్న త‌మ‌కు తప్పక న్యాయం జ‌రుగుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఇదే సమయంలో బజరంగ పూనియి పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించడం.. అవార్డును రిటర్న్‌ ఇచ్చేందుకు మోదీ ఇంటికి బయలుదేరడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


Also Read: ట్రిగ్గర్‌ చేస్తే రెచ్చిపోవద్దు.. సచిన్‌, ద్రవిడ్‌ని చూసి నేర్చుకోండి..!

#pm-modi #sakshi-malik #bajrang-punia #wrestling #regling
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe