Rajasthan: రాజస్థాన్‌లో ఈరోజు భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం..

రాజస్థాన్‌లో ఈరోజు (శుక్రవారం) భజన్‌లాల్ శర్మ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్‌ చంద్ భైర్వలు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా హాజరుకానున్నారు.

New Update
Rajasthan: రాజస్థాన్‌లో ఈరోజు భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం..

ఇటీవల ఐదు రాష్టాల్లో జరిగిన ఎన్నికల్లో.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయభేరీ మోగించిన సంగతి తెలిసిందే. ఇక బీజేపీ అధిష్ఠానం ఈ మూడు రాష్ట్రాలకు ఎవరిని సీఎంను చేయాలా అనేదానిపై కొన్నిరోజుల పాటు చర్చలు జరిపి ముఖ్యమంత్రులను ప్రకటించేసింది. అయితే ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి, మధ్యప్రదేశ్‌ మఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో ఈరోజు (శుక్రవారం) భజన్‌లాల్ శర్మ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్‌ చంద్ భైర్వలు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో విషయం ఏంటంటే భజన్‌ లాల్ తన 56వ జన్మదిన సందర్భంగా ఈరోజే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.

Also Read: పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన.. లొంగిపోయిన కీలక సూత్రధారి..

అయితే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా, రాష్ట్ర గవర్నర్ కల్‌రాజ్‌ మిశ్రా హాజరుకానున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జైపూర్‌లోని అల్బర్ట్‌ హాల్‌లో జరగనుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాటు చేశారు. మరోవైపు జైపూర్‌లోని రోడ్లకు ఇరువైపుల భజన్‌ లాల్ శర్మ పోస్టర్లు, హోర్డింగ్‌లతో సందడి వాతావరణం నెలకొంది. సంగనీర్ అనే అసెంబ్లీ నియోజకనర్గం నుంచి భజన్‌లాగ్‌ గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన పుష్పేంద్ర భరద్వాజ్‌పై 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

భజన్‌ లాల్ శర్మ ఇప్పటికే నాలుగుసార్లు బీజేపీకి జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఇక రాజస్థాన్‌లో బీజేపీ 115 స్థానాల్లో గెలవగా కాంగ్రెస్ పార్టీకి 69 సీట్లు వచ్చాయి. మొత్తం 200 స్థానాలకు 199 నియోకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఇటీవల కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ గెలుస్తుందని వెల్లడించాయి. బీజేపీ గెలిచిన అనంతరం ముఖ్యమంత్రి ఎవరిని చేయాలా అనేదానిపై కసరత్తులు జరిగాయి. ఇక చివరకి అధిష్ఠానం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను అధికారికంగా ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు