Raviteja: రవితేజ పక్కన ఆ హీరోయిన్‌ కాదు..ఈమె నటిస్తోంది!

మాస్‌ మహారాజా రవితేజ, హరీష్‌ శంకర్‌ సినిమాలో భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్‌ గా ఎంచుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రవి, హరీష్‌ కాంబోలో ఇది మూడో సినిమా. రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమాలో నటిస్తున్నారు.

New Update
Raviteja: రవితేజ పక్కన ఆ హీరోయిన్‌ కాదు..ఈమె నటిస్తోంది!

ఈ ఏడాది రవితేజ(Raviteja)  వాల్తేరు వీరయ్యతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత హరీష్‌ శంకర్‌(Hareesh Sankar) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాని విశ్వ ప్రసాద్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల నుంచి ఈ సినిమాలో యానిమల్‌ భామ త్రిప్తి దిమ్రి(Trupti dimri) నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ విషయాన్ని సినిమా బృందం మాత్రం కన్ఫర్మ్‌ చేయలేదు. అయితే తాజాగా చిత్ర మేకర్స్‌ సినిమాలో రవి పక్కన నటిస్తోంది ఎవరనేది తెలియజేశారు. ఈ సినిమాలో రవితేజ పక్కన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది. ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri borse)  టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.

చిత్ర బృందం తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ లో భాగ్యశ్రీ చాలా అందంగా కనిపిస్తోంది. చీరలో చాలా క్లాసీగా , గ్లామరస్‌ గా కనిపిస్తోంది. హరీష్‌ ఈ సినిమాలో హీరోయిన్‌ ని ఎలా చూపిస్తారనేది వేచి చూడాల్సిందే. ఆయన గత సినిమాల్లో హీరోయిన్స్ ని చాలా అందంగా చూపించారు. ఈ చిత్రం కచ్చితంగా మాస్‌, క్లాస్‌ ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ తెలిపారు.

రవి, హరీష్‌ కాంబోలో రాబోతున్న మూడో చిత్రం ఇది. ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ నటులు నటిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారని తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామా త్రిల్లర్ గా ఈ స్టోరీ ఉండబోతున్నట్లు తెలిసింది. ఇటీవలే హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. త్వరలో రాబోతున్న ఈ సినిమాతో చరిత్ర తిరగరాయబోతున్నామని తెలిపారు.

దీంతో ఈ సినిమా పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. సిల్వర్ స్క్రీన్ పై కొందరి హీరో, డైరెక్టర్స్ కాంబినేషన్ కు ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులో రవితేజ, హరీష్ శంకర్ కాంబో ఒకటి. ఇక వీరిద్దరి మ్యాజికల్ మాస్ కాంబో రిపీట్ కానుంది అని తెలియగానే అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

ప్రస్తుతం రవితేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈగల్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13 న థియేటర్స్ లో విడుదల కానుంది.

Also read: నేడు సూరత్ డైమండ్ బర్స్ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ…దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు