Andhra Pradesh: కూటమికి షాక్.. స్వతంత్ర అభ్యర్థులు 'గాజు గ్లాసు' గుర్తు కేటాయింపు

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. జనసేన పోటీలో లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం 'గాజు గ్లాసు గుర్తును' ఫ్రీ సింబల్ జాబితాలో కేటాయించింది.

New Update
Andhra Pradesh: కూటమికి షాక్.. స్వతంత్ర అభ్యర్థులు 'గాజు గ్లాసు' గుర్తు కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. జనసేన పోటీలో లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం 'గాజు గ్లాసు గుర్తును' ఫ్రీ సింబల్ జాబితాలో కేటాయించింది. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్‌ బరిలో ఉన్నచోట "గాజుగ్లాసు" గుర్తును కేటాయించింది. అలాగే కుప్పం, మంగళగిరి, టెక్కలి, ఆముదాలవలస, విశాఖ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట, గన్నవరం, మచిలీపట్నం, పాలకొల్లు, తణుకు, మండపేట, అద్దంకి, పర్చూరు, చీరాల,విజయనగరం, జగ్గంపేట, రాజమహేంద్రవరం అర్బన్‌ స్థానాల్లో, స్వంతంత్ర అభ్యర్థులకు "గాజు గ్లాసు" కేటాయించింది.

Also Read: ఇవాళ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మేనిఫెస్టో.. ప్రధాన అంశాలు ఇవే

అంతకాదు పలువురు వైసీపీ రెబల్ అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించింది ఈసీ. దీంతో ఇది వైసీపీ కుట్ర అంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. ఇదిలాఉండగా.. మే 13న ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Also Read: రెబల్స్ అభ్యర్థులకు టీడీపీ షాక్.. పార్టీ నుంచి సస్పెండ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు