Gym : జిమ్‌లో చేరే ముందు ఈ టెస్ట్‌లు చేయించుకుంటే మంచిది

వ్యాయామం శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. జిమ్‌ చేసే ముందు కొన్ని పరీక్షలు చేయించుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. వ్యాయామం చేయడం వల్ల మన గుండె అలసిపోతుంది. అందుకని గుండె ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవాలని చెబుతున్నారు.

New Update
Gym : జిమ్‌లో చేరే ముందు ఈ టెస్ట్‌లు చేయించుకుంటే మంచిది

Health Benefits : వ్యాయామం(Exercise) మీ ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును మెరుగుపరుస్తుంది. నరాల ద్వారా శక్తి ప్రవహిస్తుంది కాబట్టి వ్యాయామం మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. ప్రస్తుతం యువత వ్యాయామం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే కొంతమంది వ్యాయామం వల్ల ఇబ్బంది పడటం మనందరం చూస్తూనే ఉంటాం. అంటే వ్యాయామం చేస్తూనే కుప్పకూలి చనిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇది ఎందుకు జరుగుతోంది అనేది ప్రశ్నగా మారింది. అయితే ఇలా జరగకుండా నిరోధించడానికి జిమ్‌(Gym) చేసే ముందు కొన్ని పరీక్షలు చేయించుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. వ్యాయామం చేయడం వల్ల మన గుండె అలసిపోతుంది. కాబట్టి మన గుండె ఆరోగ్యం(Heart Health) గురించి తెలుసుకోవాలని చెబుతున్నారు.

ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (EKG):

  • ఈ పరీక్ష గుండె విద్యుత్ కార్యకలాపాలను కొలుస్తుంది. అంటే హార్ట్ బీట్ బాగా ఉందా, గుండె పాడైందా లేదా గుండె జబ్బులు ఉన్నాయా అనేది తేలికగా గుర్తించవచ్చు.

ఎకోకార్డియోగ్రామ్ (ECHO):

  • ఇది గుండెకు సంబంధించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష. గుండె పరిమాణం, ఆకారంతో పాటు గుండెలోని 4 కవాటాల పనితీరు, గుండెలోని బ్లాక్‌లు తెలుసుకోవచ్చు.

ఒత్తిడి పరీక్ష:

  • వ్యాయామానికి గుండె ఎలా స్పందిస్తుందో ఈ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.

కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కాన్:

  • ఇది CT స్కాన్ పరీక్ష(CT Scan Test), కరోనరీ ధమనులలో కాల్షియం డిపాజిట్ల మొత్తం గురించి సమాచారాన్ని అందిస్తుంది.

రక్తపోటు పరీక్ష:

  • ఇది ధమని గోడలపై రక్తపు ఒత్తిడిని కొలిచే పరీక్ష. ఒక వ్యక్తికి అధిక రక్తపోటు ఉంటే అది గుండె సమస్యలకు ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు.

కొలెస్ట్రాల్ పరీక్ష:

  • రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు.

బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌:

  • ఇది రక్తంలో గ్లూకోజ్ పరీక్ష. రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉంటే అది మధుమేహానికి దారితీస్తుంది. అంతేకాకుండా గుండెకు హానికరం.

థైరాయిడ్ పరీక్ష:

  • రక్తంలో థైరాయిడ్ హార్మోన్ల పరిమాణాన్ని తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉంటే కష్టం, అలాగే తక్కువైనా కష్టం. ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది.

CMP టెస్ట్‌:

  • ఇది రక్తంలో ఎలక్ట్రోలైట్, గ్లూకోజ్, కాలేయం, మూత్రపిండాల పనితీరు గురించి సమాచారాన్ని అందించే ఒక రకమైన రక్త పరీక్ష.

ఇది కూడా చదవండి: క్యాన్సర్ కణాలకు ఈ కూరగాయలతో చెక్.. సరిగ్గా తింటే క్యాన్సర్ రమ్మన్నా రాదు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు