Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ హెర్బల్ డ్రింక్స్ తాగండి

ఈ ఆధునిక కాలంలో ఊబకాయం అనేది తరచుగా చాలా మందిలో కనిపించే సమస్య. ఊబకాయం రావడానికి అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, మన జీవన శైలి విధానాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ హెర్బల్ డ్రింక్స్ తాగండి
New Update

Weight Loss: బిజీ బిజీ గా సాగుతున్న దినచర్య లో మనం తినే ఆహరం పై అంతగా ద్రుష్టి పెట్టే సమయం ఉండకపోవచ్చు. కానీ మనం తీసుకునే ఆహరం, మన జీవన శైలి విధానాలు మన ఆరోగ్యం,శరీరం పై చాలా ప్రభావం చూపుతాయి. చాలా మంది ఊబకాయం సమస్య తో బాధపడుతూ ఉంటారు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు అనారోగ్యపు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకుండా ఒకే చోట ఉండటం, జీవన శైలి విధానాలు ఇలా ఎన్నో కారణాల పై ఆధారపడి ఉంటుంది.

ఊబకాయ(Obesity) సమస్య ఆరోగ్యానికి చాలా ప్రమాదం.. చాలా మంది బరువు తగ్గాలని జిమ్ కి వెళ్లి వ్యాయామాలు, డైటింగ్ చేయడం ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ  కొన్ని సార్లు వాళ్ళు అనుకున్న ఫలితాలు రాకపోయేసరికి నిరాశ పడుతుంటారు. మీరు బరువు తగ్గాలి అనుకుంటే మీ ఇంట్లోనే ఈ సింపుల్ డ్రింక్స్ తయారు చేసుకొని తాగండి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

ఫెన్నెల్ (సోంపు) టీ

మూలికలతో చేసిన ఈ కాషాయం జీవక్రియను(metabolism) మెరుగుపరచడంలో తోడ్పడుతుంది, అధికంగా ఆహారాన్ని తీసుకుకోవాలనే కోరికను అరికడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికీ ఇది మంచి ఎంపిక. గోరు వెచ్చని నీటిలో సోంపు గింజలను వేసి 10 నిమిషాల పాటు ఉంచి తర్వాత దానిని వడ కట్టి తాగాలి. భోజనానికి ముందు తీసుకుంటే అధిక ఆకలిని తగ్గించి జీర్ణక్రియకు(digestion) సహాయపడి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

సెలరీ నీళ్లు

దీనిలో తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడానికి తీసుకునే పానీయాలలో దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఈ సెలరీ నీటిని ఆకుకూరల కాడలతో చేస్తారు. కాడలను కత్తిరించి వాటిలో నీళ్లు వేసి గ్రైండ్ చేసాక దాన్ని వడకట్టి తాగాలి. రుచి కోసం నిమ్మరసం కలుపుకోవచ్చు. దీనిలోని అధిక నీటి శాతం పొట్ట నిండుగా ఉంది అనే భావనను కలిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ
చాలా మంది బరువు తగ్గడానికి వారి దినచర్యలో గ్రీన్ టీ ని అలవాటు చేసుకుంటారు. దీనిలో యాంటియోక్సిడెంట్స్ (antioxidants) అధికంగా ఉంటాయి. అలాగే ఇది అధిక కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ ను 3-5 నిమిషాలు ఉంచి తర్వాత తాగాలి. రోజుకు 2-3 కప్పులు తీసుకోవాలి. భోజనానికి ముందు తీసుకోవాలి.

అల్లం-నిమ్మరసం(lemon) జ్యూస్

అల్లం(Ginger) నిమ్మ రసంతో చేసిన ఈ పానీయం బరువు తగ్గడానికి ఒక బెస్ట్ ఆప్షన్. ఇది జీవక్రియను(metabolism) ఉత్తేజపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని తగ్గిస్తుంది. నిమ్మకాయలోని విటమిన్ 'సి', యాంటియోక్సిడెంట్స్ శరీరానికి మేలు చేస్తాయి. వేడి నీటిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి, కాస్త నిమ్మ రసం వేసుకొని భోజనానికి ముందు తీసుకోవాలి. ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గడంతో తోడ్పడుతుంది.

ఆకుకూరల జ్యూస్..

ఆకుకూరలు, కూరగాయల తో చేసిన ఈ జ్యూస్ ఎక్కువ పోషకాలు, తక్కువ కేలరీలు కలిగి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనిలోని విటమిన్స్, మినరల్స్, ఫైబర్ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. క్యారెట్, దోసకాయ, బచ్చలికూర, పాలకూర వేసి గ్రైండ్ చేసుకొని ఫ్రెష్ గా తాగాలి. వడకడితే వాటిలోని ఫైబర్ కంటెంట్ పోతుంది. దీనిని భోజనానికి బదులుగా అయినా తీసుకోవచ్చు లేదా ఏదైనా స్నాక్ లా కూడా మీ దినచర్య లో అలవాటు చేసుకోవచ్చు.

Also Read: Digestion Tips: ఈ ఐదు పండ్లతో మలబద్ధకానికి చెక్‌..ప్రాబ్లెమ్స్‌ అన్ని ఫసక్‌..!

#weight-loss #weight-loss-tips #best-juices-for-weight-loss #5-tips-to-lose-weight #weight-loss-drinks
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe