Winter Eat Eggs: చలికాలంలో గుడ్లను ఇలా తింటే బెస్ట్.. లేదంటే కష్టమే..!! గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మొదలైన అనేక పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లతో బరువు తగ్గడంతోపాటు, ఎముకలును ఎంతో మెరుగు పరుస్తుంది. గుడ్లను అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. చలికాలంలో రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు. By Vijaya Nimma 10 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Winter Eat Eggs: శీతకాలంలో ఏ ఆహారం తిన్న కొద్దిగా వేడిగా తినాలనిపిస్తుంది. అయితే.. గుడ్లు తినడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ.. తరచుగా గుడ్లు సరైన పద్ధతిలో తినరు. శీతకాలంలో గుడ్లు తినే వారు వాటిని ఎలా తినాలో కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే లాభం కన్న నష్టమే ఎక్కవగా వస్తుంది. గుడ్లు తింటే ఎలాంటి లాభాలు, కష్టాలలున్నాయో..? ఆహారంలో గుడ్లు ముఖ్యమైన భాగం. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మొదలైన అనేక ముఖ్యమైన పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లు తినడం, సిద్ధం చేయడం చాలా సులభంగా ఉంటుంది. వీటిని వేయించి, ఆమ్లెట్‌లు, ఉడకబెట్టి ఎక్కవగా తింటారు. వీటిని రుచికరమైన, సులభంగా వండగలిగే ఆహారంలో ఇది ఒకటి. గుడ్లతో బరువు తగ్గడంతోపాటు, ఎముకలు, ఆరోగ్యాన్ని ఎంతో మెరుగు పరుస్తుంది. గుడ్లను అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. చలికాలంలో రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు. గుడ్లు తినడానికి సరైన మార్గం ఏమిటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఉడకబెట్టిన కోడిగుడ్లు: ఉడకబెట్టిన కోడిగుడ్లను ఎప్పుడు వడినా వెంటనే వాటిని తినాలి. ఉడకబెట్టిన గుడ్లను పొట్టు తీసి గంటల తరబడి బయట ఉంచితే అందులో హానికరమైన బ్యాక్టీరియా పెరుతుంది. అందుకని.. ఉడికించిన గుడ్లు పొట్టు తీసి కనీసం 2 గంటల్లోపు తింటే చాలా మంచిది. ఇలా తింటే బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది. తక్కువ నూనె బెస్ట్ గుడ్లు వండేటప్పుడు తక్కువ నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనెను వేస్తే గుడ్లు ఉడికించడం వల్ల వాటి కేలరీలు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలా వండిన కూర తింటే ఆరోగ్యానికి హానికరం. అందువల్ల, గుడ్లను ఎప్పుడూ తక్కువ నూనెలో ఉడికించి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. గుడ్డు సరిగ్గా ఉడకాలి గుడ్డును వండేటప్పుడు పూర్తిగా ఉడికించుకోవాలి. కొన్నిసార్లు ఉడకని గుడ్లు ఇన్ఫెక్షన్‌ను వ్యాప్తి చేసే హానికరమైన బ్యాక్టీరియాను రావచ్చు. గుడ్డును ఉడికించినప్పుడల్లా.. చిన్న మంటపై 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఎక్కువసేపు ఉడికించడం వల్ల గుడ్డులోని బ్యాక్టీరియా మొత్తం చనిపోయి తినడానికి సురక్షితంగా ఉంటుంది. ఇది కూడా చదవండి: అర్ధరాత్రి ఆకలేస్తే ఈ ఆహారాలు తినండి.. ఆరోగ్యానికి మంచిది గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #eggs #winter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి