వైజాగ్(Vizag) అంటే ప్రకృతి అందాలకు నిలయం. సిటీ అంటే అందంగానే ఉంటుందని చెప్పడంలేదు కానీ.. కొన్ని ప్రాంతాలకు వెళ్తే మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లాలనిపించదు. ఆ ప్రాంతాలకు చుట్టూ నివాసముంటున్న వారు ఎంతో లక్కీనో అనిపిస్తుంది. వీకెండ్స్‌లోనే కాకుండా విశాఖలో లవర్స్ నిత్యం చాలా ప్రాంతాల్లో చక్కర్లు కొడుతుంటారు. ముఖ్యంగా పార్కులు ఎంతో బాగుంటాయి. సుందరమైన ఈ పార్కులకు లవర్స్‌తో పాటు ఫ్యామిలీలు కూడా వస్తుంటాయి. అయితే అక్కడ ఎవరి స్పాట్స్ వారికి ఉంటాయి. అటు వైజాగ్ బీచ్‌ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. మా కోసమే ఈ బీచ్‌లు ఉన్నాయా అని లవర్స్ అనుకునేలా కెరటాలు ఎగిసిపడుతుంటాయి. ఇలా లవర్స్ కోసం చాలా స్పాట్స్ ఉన్నాయి. వాటిలో కొన్నిటిపై ఓ లుక్కేయండి.
యారాడ బీచ్:
విశాఖపట్నం నుంచి దూరంలో యారాడ అనే గ్రామంలో ఉంది. ఏపీలో చాలా సుందరమైన బీచ్ ఇది. లవర్స్ ఎంజాయ్ చేయడానికి బెస్ట్ బీచ్. అయితే కొంచెం డెంజరస్ కూడా. అలలతో ఆటలొద్దు. ఒడ్డుకు కాస్త దూరంగా కూర్చొని లవర్‌తో హ్యాపీగా మాట్లాడుకొవచ్చు. భలేభలే కబుర్లు చెప్పుకోవచ్చు.. ఎగిసి పడుడుతున్న అలలను చూసి మరో ప్రపంచంలో మునిగితేలవచ్చు.
తెన్నేటి పార్కు:
ఈ పార్కుకి వెళ్లిన తర్వాత వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కింద బీచ్ ఉంటుంది.. పైన పార్క్ ఉంటుంది. మధ్యలో కూర్చొడానికి స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ కూడా ఆర్టిఫిషియల్‌వి కాదు.. కొండపై భాగాన నుంచి కిందకి ఉన్న స్టెప్స్ అవి. అక్కడ ఎక్కువగా లవర్స్ కూర్చుంటారు. నగరంలోని పురాతన పార్కులలో ఇది ఒకటి. బంగాళాఖాతం సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈ పార్కులో పార్కులో జీవీఎంసీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసింది. ఈ పార్కుకు తెన్నేటి విశ్వనాథం పేరు పెట్టారు.
రుషికొండ బీచ్:
రాష్ట్ర పర్యాటక బోర్డు, ఏపీటీడీసీ నిర్వహిస్తోన్న ఈ బీచ్‌కు లవర్స్ తాకిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. బీచ్ ఒడ్డున కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే ప్రేమ జంటలు ఎక్కువగా ఈ బీచ్‌లోనే కనిపిస్తాయి. సముద్రపు అలలు చూస్తూ ప్రేమ మైకంలో మునుగుతారు ప్రేమికులు. ఈ లోకాన్నే మర్చిపోయి ఎంజాయ్ చేస్తారు.
కైలాసగిరి:
కొండపైనే పార్కులు ఉంటాయి. శివుడు ఉంటాడు. సిటీ మొత్తం కనిపిస్తుంది. చాలా పెద్ద ఉద్యానవనం ఇది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి చేసిన ఈ ఉద్యానవనం 380 ఎకరాలు భూమిలో వృక్ష, ఉష్ణమండల చెట్లతో కప్పబడి ఉంది. 568 అడుగులు ఎత్తులో ఉన్న ఈ కొండ విశాఖపట్నం వ్యూని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఒకసారి కైలాసగిరిని విజిట్ చేసిన వారు పదేపదే వెళ్తుంటారు. ముఖ్యంగా లవర్స్‌కి బెస్ట్ స్పాట్ ఇది.
Also Read: రోహిత్ శర్మ నాటౌటా? హెడ్ క్యాచ్‌పై సోషల్‌మీడియాలో రచ్చ..!
WATCH: