Sugarcane Juice Benefits in Telugu: చెరుకు రసం సీజన్ వచ్చేసింది. వేసవి కాలం (Summer) వచ్చిందంటే... చెరుకు రసాన్ని అధికంగా తీసుకునే వారు చాలా మందే ఉంటారు. చెరుకురసంలో కాల్షియం(Calcium) , మెగ్నీషియం, పొటాషియం(Potassium) , ఐరన్(Iron), మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఈ రసంలో అసిడిక్ గుణాలు కూడా ఉంటాయి.
చెరుకురసం అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరం డిటాక్సి ఫై ( శరీరానికి హాని కలిగించే పదార్థాలను బయటకు పంపడం) చేయడంలో సహాయపడుతుంది.
ముఖ్యంగా ఈ మూడు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసం తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.
1. మూత్రవిసర్జన లో
చెరుకురసం శరీరంలోని అనవసరమైన వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మూత్రాశయం నుంచి బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. అంతేకాకుండా శరీరంలో ఏర్పడే డీ హైడ్రేషన్ ను తగ్గిస్తుంది. శరీరం pH ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
2. కాలేయ పనితీరులో
కాలేయం నుండి విషాన్ని తొలగించడంలో చెరకు రసం బాగా సహాయపడుతుంది. ఇది పిత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కాలేయం పనితీరును వేగవంతం చేసే ఎంజైమ్‌లను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా కాలేయ పనితీరును వేగవంతం చేస్తుంది (ఫ్యాటీ లివర్‌కు చెరకు రసం), కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
3. అధిక కొలెస్ట్రాల్ కోసం చెరకు రసం
అధిక కొలెస్ట్రాల్ కోసం చెరకు రసం తాగడం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ధమనులను శుభ్రపరుస్తుంది, ఇది రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. కాబట్టి, అధిక కొలెస్ట్రాల్‌లో చెరకు రసం (Sugarcane Juice) తాగడం వల్ల మేలు జరుగుతుంది. మరీ ఇంకేందుకు ఆలస్యం వెంటనే చెరుకు రసాన్ని మీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి!
Also read: చెరుకు రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ ..కొనుగోలు ధరలు పెంపు..కొత్త ధరలు ఇవే..!!