Fitness:రివర్స్ వాకింగ్..దీని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. వాకింగ్ చేస్తే మన శరీరానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. దీని వలన బరువు కూడా తగ్గుతారు. అయితే రివర్స్ వాకింగ్ గురించి మీకు తెలుసా. రోజూ కాసేపు అయినా వెనక్కు వాకింగ్ చేస్తే చాలా ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. By Manogna alamuru 11 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Reverse walking:మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. నడక చాలా తేలికైన, చవకైన అందరికీ అందుబాటులో ఉండి అందరూ చేయదగిన వ్యాయాయం. నడక రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. రోజూ నడిస్తే.. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) కూడా పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజు స్థాయి తగ్గుతుంది. అయితే ముందుకు నడవడమే కాదు.. వెనక్కి నడిస్తే కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.\ Also read:క్లీన్ సిటీల్లో టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాలు కేలరీలు ఎక్కువ ఖర్చు అవుతాయి.. రివర్స్ వాకింగ్‌లో మామూలు నడకకంటే.. ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. ముందు నడవడం అనేది మనకు నడక వచ్చిన దగ్గర నుంచీ అలవాటయిన క్రమం. దీనిలో మనం పెద్దగా కష్టపడేది ఉండదు. కానీ రివర్స్ వాకింగ్ అలా కాదు. వెనక్కు నడవాలంటే ఎక్కువ శక్తిని పెట్టాలి. దీనిలో కండరాలు ఎక్కువగా కష్టపడతాయి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రకారం గంటకు 3.5 మైళ్ల వేగంతో నడిస్తే.. 4.3 METలు క్యాలరీలు బర్న్ అవుతాయి.కానీ అదే రివర్స్ వాకింగ్ వల్ల.. 6.0 METలు బర్న్ అవుతాయని స్పష్టం చేసింది. కాబట్టి ACSM ప్రకారం, వేగంగా నడవడం కంటే రివర్స్ వాకింగ్ నిమిషానికి 40% ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తుంది. దీనివల్ల త్వరగా బరువు తగ్గగలరు. ఆర్థరైటిస్ వాళ్ళకు మంచింది... ఈ రకమైన నడక ఆస్టియో ఆర్థరైటిస్, జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. ఈ నడక కండరాలను బలోపేతం చేస్తుంది. మోకాళ్లు, నడుము నొప్పి ఉన్నవారికి ఉపశమనాన్నిస్తుంది. రివర్స్ వాకింగ్ నడక వేగం, సమతుల్యత మెరుగుపరుస్తుంది. ఇతర ఫిజికల్ థెరపీ చికిత్సలతో కలిపినప్పుడు, మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్, జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ACL గాయాలు ఉన్నవారిలో రివర్స్ వాకింగ్ మేలు చేస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది... రివర్స్ వాకింగ్.. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రివర్స్ వాకింగ్ కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్‌కు మేలు చేస్తుంది. గుండె, ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ను మరింత సమర్థంవంతంగా అందించడానికి సహాయపడుతుంది. రివర్స్ వాకింగ్ శరీరంలో కొవ్వు, మెరుగైన కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్‌ను తోడ్పడుతుందని అధ్యయనాల్లో తేలింది. బుర్ర పదునెక్కుతుంది.. వెనక్కి నడవడం వల్ల ఆలోచనా నైపుణ్యాలు మెరుగుపడతాయి. అభిజ్ఞా నియంత్రణను పెంచుతుంది. ఇది కళ్లకు చాలా ఉపయోగకరంగా కూడా పని చేస్తుంది. ముఖ్యంగా మన శరీరంలోని ఇంద్రియాలను పదునుపెట్టి.. మానసిక, శారీరక సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఇక బయోమెకానిక్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ముందుకు వాకింగ్ చేయడం కంటే వెనక్కి నడవటం వల్ల మోకాలి నొప్పిని తగ్గుతుంది. బాడీని స్టిమ్యులేట్ చేస్తుంది. #helath #fitness #benifits #wailking #reverse మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి