IPL : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(RCB) మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. శనివారం సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన బెంగళూరు.. 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది.
Also Read : రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ.. అమేథీని కాదని అక్కడే ఎందుకు?
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. షారూఖ్ (37), తెవాటియా (35) రాణించడంతో గౌరవ ప్రదమైన స్కో్ర్ చేయగలిగింది. బెంగళూర్ బౌలర్లు సిరాజ్, యశ్ దయాల్, విజయ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కామెరాన్, కర్ణ్ శర్మ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూర్.. మొదటినుంచి ధాటిగా ఆడింది. డుప్లెసిస్ (64; 23 బంతుల్లో), విరాట్ కోహ్లీ (42; 27 బంతుల్లో) గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివర్లో దినేశ్ కార్తిక్ (21; 12 బంతుల్లో), స్వప్నిల్ సింగ్ (15; 9 బంతుల్లో) వేగంగా పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో జోష్ లిటిల్ 4, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ 2/29 దక్కించుకున్నాడు.