తెగిపడిన విద్యుత్ వైర్‌..9 నెలల బిడ్డతో పాటు తల్లి మృతి!

విద్యుత్‌ అధికారులు నిర్లక్ష్యం వల్ల తల్లితో పాటు 9 నెలల చిన్నారి కూడా మృతి చెందింది. రోడ్డు పై విద్యుత్ వైరు తెగిపడడం..చీకట్లో అది కనిపించక దాని మీద కాలు వేసిన తల్లి, బిడ్డ మృతి చెందారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

తెగిపడిన విద్యుత్ వైర్‌..9 నెలల బిడ్డతో పాటు తల్లి మృతి!
New Update

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రోడ్డు మీద తెగి పడిన విద్యుత్‌ వైరు కనిపించకపోవడంతో చీకట్లో ఆ వైరు మీద కాలు వేయడంతో ఓ మహిళ ఆమె 9 నెలల బిడ్డ ఇద్దరు మరణించారు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు కు చెందిన సౌందర్య (23) తన 9 నెలల బిడ్డ సువికాస్‌లియాతో కలిసి ఆదివారం ఉదయం తమిళనాడు నుంచి నగరానికి చేరుకుంది. ఉదయం ఆరు గంటల సమయంలో వైట్ ఫీల్డ్‌ ప్రాంతంలోని ఇంటికి నడిచి వెళ్తుంది. రోడ్డు పై పడి ఉన్న విద్యుత్‌ వైరును గమనించక దాని మీద కాలు వేసింది.

దీంతో ఆమెతో ఆమె చేతిలోని 9 నెలల కుమార్తె కూడా విద్యుదాఘాతంతో మరణించారు. ఈ సంఘటనలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పై స్థానికలుఉ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లీబిడ్డ మృతికి వారే కారణమని ఆరోపించారు. కాగా ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

విద్యుదాఘాతం వల్ల చనిపోయిన తల్లి, బిడ్డ మృతదేహాలను పోస్ట్‌ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్) అధికారులు, సిబ్బందిని కూడా ప్రశ్నిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.

Also read: ప్చ్.. రోహిత్‌ హాఫ్‌ సెంచరీ మిస్‌.. ‘హెడ్‌’ పగిలే క్యాచ్‌ భయ్యా

#bengaluru #daughter #mother #crime
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe