Science : ఖగోళంలో అద్భుతం..జీరో షాడో డే ఈరోజు

ప్రతీ ఏడాది ఒకరోజు అద్భుతం జరుగుతుంది. సూర్యుడు అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఏ వస్తువు లేదా మానవుని తాలూకా నీడా కనబడదు. ఇలా కేవలం ఏడాదిలో ఒక రోజు మాత్రమే జరుగుతుంది. మూములుగా అయితే మిగతా అన్ని రోజుల్లో సూర్యుడు ఏ పొజిషన్‌లో ఉన్నా కూడా నీడ ఉంటుంది.

New Update
Science : ఖగోళంలో అద్భుతం..జీరో షాడో డే ఈరోజు

Zero Shadow Day : వెలుతురు ఉన్న చోట నీడ(Shadow) తప్పక ఉంటుంది. మనతో ఎవరున్నా లేకపోయినా... మన నీడ మాత్రం మన వెంటే ఎప్పుడూ ఉంటుంది. సాధారణ లైటుకే నీడ కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు లోకమంతటికీ వెలుగునిచ్చే సూర్యుడు వెలుతురులో నీడ లేకుండా ఉంటుందా అంటే.. ఒక్కరోజు మాత్రమే అని చెప్పవచ్చును. ఇదో ఖగోళ అద్భుతం. సూర్యుడు, ఉంటాడు, బ్రహ్మాండమైన వెలుగు ఉంటుంది. కానీ నీడ మాత్రం ఉండదు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే కనిపించే ఈ అరుదైన సన్నివేశం ఇవాళ జరగనుంది. దీన్ని జీరో షాడో డే(Zero Shadow Day). అంటారు. అది కూడా రోజంతా ఉండదు. పర్టిక్యులర్‌గా ఒక టైమ్‌లో మాత్రమే ఇలా జరుగుతుంది. కొంతసేపు పాటూ మన లేదా వస్తువుల నీడ కనిపించదు.

ఈరోజు మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 వరకు నీడ అన్నది కనిపించదు. ఈ కొద్ది సేపటిని శాస్త్రవేత్తలు, ఆస్ట్రోఫిజిక్స్ కు సంబంధించిన వాళ్ళు చాలా నిశితంగా గమనిస్తారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కూడా తన క్యాంపస్‌లో దీనికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ జీరో షాడో ద్వారా భూమి తాలూకా వ్యాసాన్ని, భ్రమణ వేగాన్ని అంచనా వేస్తారు. గత కాలానికి, ఇప్పటికీ ఉన్న తేడాలను బేరీజు వేస్తారు. దాన్ని బట్టి ఖగోళ స్థితి గతులు ఎలా ఉన్నాయో, ఏఏ మార్పులకు గురవుతున్నాయో లాంటి అంశాల మీద పరిశోధనలు చేస్తారు.

Also Read: Lok Sabha Elections: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్.. తెరపైకి ప్రియాంక గాంధీ పేరు.. 

Advertisment
Advertisment
తాజా కథనాలు