చాలామంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం పుస్తకాలతో కుస్తీ పడతారు. సాధారణంగా ఏదైన ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఆ పరీక్షకు ముందు అడ్మీట్ కార్డు వస్తుంది. కానీ ఓ చోట మాత్రం ఏకంగా ఏడేళ్ల తర్వాత అడ్మిట్ కార్డు వచ్చింది. ఈ వింత సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ వ్యవసాయశాఖ 2016లో తమ విభాగంలో అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ నిర్వహించింది. దీనికోసం ఆ ఏడాది మార్చిలో న్యూస్ పేపర్‌లో ఓ ప్రకటన ఇచ్చింది. అయితే దీన్ని చూసి వర్ధమాన్ జిల్లాకు చెందిన ఆశిష్ బెనర్జీ అనే అభ్యర్థం ఆ ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత నియామక పరీక్షకు సంబంధించి అతడికి ఎలాంటి అప్‌డేట్ కూడా లేదు. ఎన్నిరోజులు ఎదురుచూసినా అడ్మిట్ కార్డు రాకపోవడంతో.. ఆశిష్ నిరాశకు లోనయ్యాడు.
Also Read: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో అలా చేయడం కష్టమే: సుప్రీంకోర్టు
ఇక చివరికి చేసేదేమి లేక దాని గురించి మర్చిపోయాడు. కానీ ఈ ఏడాది నవంబర్1న ఆశీష్ షాకయ్యే ఘటన జరిగింది. ఆరోజున వ్యవసాయ శాఖ నుంచి అతనికి ఓ పోస్టు వచ్చింది. ముందుగా ఆ లెటర్‌ను చూసి షాకైన ఆశిష్.. అందులో లెటర్‌ను చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఎందుకంటే అందులో ఉంది 2016 నాటి రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆ పరీక్ష 2016 డిసెంబర్ 18నే జరిగింది. పరీక్ష జరిగిన ఏడేళ్లకు అడ్మిట్ కార్డ్ రావండంతో అతడు విస్తుపోయాడు. అయితే ఇలా అడ్మిట్ కార్డు ఆలస్యంగా రావడానికి గల కారణాలేంటో దర్యాప్తు చెపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. అలాగే దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉండగా.. మరోవైపు ఇటీవల బెంగాల్‌లోని పలు ఉద్యోగ నియామక కుంభకోణాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పడు ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఇది కూడా స్కామ్‌లో భాగమే అయి ఉంటుందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై టీఎంసీ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ నిలదీశాయి. ప్రస్తుతం ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది.