Cooking Papaya Benefits : పండిన బొప్పాయి(Papaya) అనేక ఆరోగ్య ప్రయోజనాలను(Health Benefits) అందించినట్లే పచ్చి బొప్పాయిలో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి బొప్పాయి అనేది భారతీయ వంటకాలలో(Indian Dishes) అంతర్భాగమైన బహుముఖ కూరగాయ. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయిలో ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బొప్పాయిని వంటల్లో వెసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
జీర్ణ ఎంజైములు:
- పచ్చి బొప్పాయిలో పాపైన్, చైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ ఎంజైమ్‌లు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా బొప్పాయిలోని ఫైబర్ ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
విటమిన్ సి పుష్కలం:
- కేవలం సిట్రస్ పండ్లలోనే విటమిన్ సి(Vitamin C) ఉంటుందనుకుంటారు. పచ్చి బొప్పాయిలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తి(Immune Power) ని పెంచడంతో పాటు చర్మ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. కొల్లాజెన్‌ను అధికంగా కలిగి ఉంటుంది.
చర్మ ఆరోగ్యం:
- పచ్చి బొప్పాయిలో విటమిన్లు ఎ, సి, ఈ ఉండటం వల్ల ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షించడంలో పచ్చిబొప్పాయి ఉపయోగపడుతుంది.
రుతుక్రమ సమస్యలకు:
- అధ్యయనాల ప్రకారం.. పచ్చి బొప్పాయి రుతుచక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది పీరియడ్స్ సమస్యల(Periods Issues) నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కీళ్ల నొప్పులు మాయం:
- మీ డైట్‌లో పచ్చి బొప్పాయిని చేర్చుకోవడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులు వంటి వాపులను తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారికి(Weight Loss) కూడా ఇది మంచి ఎంపిక. పచ్చి బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. పచ్చి బొప్పాయిలోని ఎంజైమ్‌లు కొవ్వును కరిగించడంలో చక్కగా పనిచేస్తాయి.
ఇది కూడా చదవండి : నోటి దుర్వాసన వేధిస్తోందా..? ఇలా తరిమేయండి
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: బీర్ ముఖానికి రాసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా?