Healthy Food: డ్రై ఫ్రూట్స్-నట్స్ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. రోజూ గుప్పెడు గింజలు తింటే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. గింజలు శరీరానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి తీవ్రమైన వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం వరకు అన్నింటికీ డ్రై ఫ్రూట్స్ ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా జీడిపప్పును ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ డ్రై ఫ్రూట్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. బ్లడ్ ప్రెజర్(BP), బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
డ్రై ఫ్రూట్స్ ప్రయోజనాలు:
- బరువు తగ్గాలనుకునే వారు నట్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వాల్‌నట్స్, బాదం, జీడిపప్పు లాంటి గింజలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటి వినియోగం బరువు పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అటు జీడిపప్పు తినడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
- జీడిపప్పు తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ తగ్గిందని అధ్యయనం కనుగొంది. టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారు జీడిపప్పును వారి ఆహారంలో చేర్చడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఎందుకంటే జీడిపప్పు ఫైబర్‌కు మంచి మూలం. ఇది రక్తంలో చక్కెర పెరగకుండా నిరోధించడంలో సహాయపడే పోషకం. మరో అధ్యయనం ప్రకారం జీడిపప్పు తినే వారిలో టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారు ఇన్సులిన్ స్థాయిలను గణనీయంగా నియంత్రించినట్లు కనుగొనబడింది.
- జీడిపప్పులో మంచి కొవ్వుల, యాంటీఆక్సిడెంట్లు లాంటి బయోయాక్టివ్ మాక్రోన్యూట్రియెంట్స్ ఉన్నాయి. దీని వల్ల ఇది మన రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను బ్యాలెన్స్‌గా ఉంచుతుంది. మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- మెగ్నీషియం, కాల్షియం జీడిపప్పులో ఉంటాయి. మెగ్నీషియం, క్యాల్షియం మన శరీరాన్ని అనారోగ్యానికి గురికాకుండా చేస్తుంది.
ఇది కూడా చదవండి: శివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా? దీక్ష సమయంలో ఈ పానీయాలు తాగవచ్చా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.