పెద్దమ్మ గుడి నుంచి ఎల్బీ స్టేడియానికి...

మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి మొదటగా హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడికి వెళ్ళనున్నారు. అక్కడి నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు.

New Update
పెద్దమ్మ గుడి నుంచి ఎల్బీ స్టేడియానికి...

Peddamma Temple - LB Nagar : ప్రమాణ స్వీకారానికి ముందు రేవంత్ రెడ్డి (Revanth Reddy)పెద్దమ్మ తల్లి (Peddamma Temple)ని దర్శించుకోనున్నారు. కుటుంబసభ్యలుతో కలిసి అమ్మవారిని దర్వించుకోనున్నారు. తర్వాత అక్కడి నుంచి నేరుగ ఆఎల్బీ స్టేడియానికి రేవంత్ చేరుకోనున్నారు. మధ్యలో గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర ఆగి ఆయన నివాళులు అర్పించనున్నారు.

మరోవైపు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు. ఇప్పటికే నాలుగు బస్సులను అధికారులు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ సీఎంగా..భట్టి డిప్యూటీ సీఎంగా..పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకాం చేయనున్నారు.

Also read:నగరానికి విచ్చేసిన సోనియా, రాహుల్, ప్రియాంక..ఆహ్వానం పలికిన రేవంత్

తెలంగాణ నూతన ప్రభుత్వం ఇవాళ కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు.. 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవి కేటాయించిన వారికి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఫోన్లు చేశారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కను నియమించారు. ఈ మేరకు మంత్రుల లిస్ట్ రాజ్‌భవన్‌కు చేరుకుంది. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, కొండా సురేఖ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, మంత్రుల జాబితాలో ఉన్న వారికి మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమయంలోనే మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు