International : మోదీకి మద్దతిచ్చిన సత్యం సురానా..యూనివర్శిటీలో వేధింపులు

తాను మోదీని, భారతీయులను సపోర్ట్ చేయడమే నేరం అయింది అంటున్నాడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకానిమిక్స్‌లో చదువుతున్న సత్యం సురానా. దీని కారణంగానే తాన మీద ద్వేషపూరితమైన ప్రచారాన్ని చేశారని చెబుతున్నాడు.

New Update
International : మోదీకి మద్దతిచ్చిన సత్యం సురానా..యూనివర్శిటీలో వేధింపులు

PM Modi : లండన్ స్కూల్ ఆఫ్ ఎకానిమిక్స్‌(London School Of Economics) లో చదువుతున్న భారతీయ స్టూడెంట్(Indian Student) సత్యం సురానా(Satyam Surana) సడెన్‌గా వార్తల్లో నిలిచాడు. దానికి కారణం అతను చేస్తున్న ఆరోపణలు. ఇతను చదువుతున్న యూనివర్శిటీలో యూనియన్ జనర్ల్ సెక్రటరీ ఎన్నికలు అయ్యాయి. ఇందులో సత్యం కూడా పోటీ చేశాడు. ఇందులో సత్యం, అతని టీమ్ గెలిచారు. అయితే దానికన్నా ముందు తానను మానసికంగా వేధించారని... తన మీద ద్వేషపూరితమైన ప్రచారాలు చేశారని ఆంటున్నారు సత్యం. ఎన్నికల పోలింగ్‌కు 24 గంటల ముందు ఇస్లామోఫోబ్, జాత్యాంహకార, టెర్రరిస్ట్, ఫాసిస్ట్, క్వీర్ ఫోబ్ లాంటి విషయాలతో జత చేసి తనను హింసించారని చెబుతున్నాడు. దాంతో పాగూ బీజేపీ సభ్యుడిగా కూడా చిత్రీకరించాలని చూశారని అంటున్నారు సత్యం. ఈ విషయాలన్నింటి గురించి వివరిస్తూ అతను ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

భారతదేశం ఎదగడం చూడలేకపోతున్నారు...
ఎన్నికల(Elections) ముందు తాను అనుభవించిన చిత్రవధకు కారణం తాను బారతీయులకు, ప్రధాని మోదీకి మద్దతు పలకడమే అని చెబుతున్నారు సత్యం సురానా. దాంతో పాటూ గత ఏడాది అక్టోబర్‌లో లండన్‌లోని భారత్ హైకమీషన్ బయట జరిగిన ఖలిస్తాన్ మద్దతుదారుల నిరసన సందర్భంలో భారత పతాకాన్ని ఎగురవేసి వ్యతిరేకతను తెలపడం కూడా తాను చేసిన తప్పు అంటున్నారు. అందుకే ఇప్పుడు నా మీద కక్ష కట్టారని చెబుతున్నారు సత్యం. భారతీయులు మార్గ నిర్దేశం చేసేంత స్థాయికి ఎదగడం చాలా మంది జీర్జించుకోలేకపోతున్నారు. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని అంటున్నారు. భారతీయులకు, మోదీకి వ్యతిరేకులు అయిన రాజకీయ ప్రత్యర్ధులే ఇవన్నీ చేయిస్తున్నారని సత్యం ఆరోపిస్తున్నారు. ఇది క్లియర్‌గా అందరికీ తెలుస్తోందని చెబుతున్నారు. అయితే ఏం జరిగినా తాను మాత్రం తన మాతృభూమిని ప్రేమిస్తానని... ఎప్పటికైని ఇండియా(India) కే వచ్చి సెటిల్ అవుతున్నాని గతర్వంగా చెప్పారు సత్యం సురానా. తాను భారత్‌కు వచ్చే క్షణాల కోసం ఎదురు చూస్తున్నాని అన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాను తన దేశం కోసం , ప్రధాని మోదీ కోసమే మాట్లాడతానని..ఎక్కడా తగ్గేదే లేదని అంటున్నారు.

Also Read:Andhra Pradesh : నేటి నుంచే వైసీపీ ఎన్నికల శంఖారావం\

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు