Home Remedies : వేసవి(Summer) లో సూర్యరశ్మి(Sunshine) కి గురికావడం స్కిన్ టానింగ్ కు కారణమవుతుంది. దుమ్ము, దూళి, కాలుష్యం ప్రభావం చర్మం పై ఎక్కువగా కనిపిస్తుంది. చెమట కారణంగా, ఇవన్నీ డెడ్ స్కిన్‌లో చేరిపోతాయి. అయితే చాలా మంది ముఖం శుభ్రత పై పూర్తి శ్రద్ధ వహిస్తారు. కానీ మెడ వెనుక పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడం మర్చిపోతుంటారు. లేదా చాలా తక్కువ క్లీనింగ్ చేస్తుంటారు. దీని కారణంగా క్రమంగా ఈ ప్రదేశం నల్లగా కనిపించడం ప్రారంభిస్తుంది. ఇలాంటి పేరుకుపోయిన జిడ్డును వదిలించడానికి ఈ సింపుల్ టిప్ ఫాలో అయితే సరిపోతుంది. ఇది మెడ(Neck) చుట్టూ ఉన్న నలుపును తొలగిస్తుంది.
మెడ నలుపును తొలగించే ప్యాక్
మెడ, చేతులు, కాళ్లపై పేరుకున్న మురికిని తొలగించుకోవాలంటే ఈ పేస్ట్‌ను అప్లై చేయండి. ప్యాక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు..
- ఒక చెంచా కాఫీ పొడి
- ఒక చెంచా బియ్యప్పిండి,
- ఒక చెంచా తేనె
ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని మెడ, చేతులు, కాళ్లు, ప్రభావిత ప్రదేశాల్లో అప్లై చేయండి. దాదాపు అరగంట తర్వాత మృదువుగా మసాజ్ చేసి ప్యాక్ తీసి చల్లటి నీటితో కడగాలి. ఈ ప్యాక్‌ని రోజూ వేసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మెడలోని చుట్టూ ఉన్న నలుపు తొలగిపోతుంది.
బియ్యప్పిండిని చర్మానికి రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
బియ్యప్పిండి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కొరియన్ లాంటి గ్లాసీ చర్మాన్ని పొందడానికి బియ్యం నీటిని తరచుగా ఉపయోగిస్తారు. ఇది ఖచ్చితంగా మెరిసే చర్మాన్ని ఇస్తుంది. అదే సమయంలో, బియ్యం పిండిని అప్లై చేయడం వల్ల చర్మంపై మచ్చలు లేదా చీకటి తొలగిపోతుంది. అంతేకాకుండా, చర్మం యొక్క ఛాయ కూడా స్పష్టంగా మారుతుంది. బియ్యప్పిండిని తేనె మరియు కాఫీ పొడితో కలిపినప్పుడే అది సహజసిద్ధమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి నల్లదనాన్ని తొలగిస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Life Style: ఆహారాన్ని చేతులతో ఎందుకు తింటారో తెలుసా..? సైన్స్ ఏం చెబుతోంది .?