Anupama Parameswaran : సీక్రెట్‌ గా పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్‌..మెడలో మంగళసూత్రమే సాక్ష్యం!

ఉంగరాల జుట్టు ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తన సోషల్‌ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. అందులో ఆమె తన మంగళసూత్రాన్ని చూపిస్తుంది. దీంతో ఆమె సీక్రెట్‌ గా పెళ్లి చేసుకుందని అభిమానులు బాధపడుతున్నారు. కానీ అవి సినిమా స్టిల్స్‌ అని తెలుసుకుని సంబరపడుతున్నారు.

New Update
Anupama Parameswaran : సీక్రెట్‌ గా పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్‌..మెడలో మంగళసూత్రమే సాక్ష్యం!

Anupama Parameswaran : అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌(Anupama Parameswaran)  కు పెళ్లి(Marriage) అయిపోయింది. ఏంటి నిజంగా పెళ్లి అయిపోయిందా..ఇంత సీక్రెట్‌ గా ఎవరికీ చెప్పకుండా ఈ పాప ఎందుకు పెళ్లి చేసుకుంది అనే అనుమానం అందరికి మొదలైందా. అయితే కంగారు పడకండి. ప్రస్తుతం అనుపమ తెలుగు, తమిళం, మలయాళం అనే తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తుంది.

ప్రస్తుతం తెలుగులోనే ఈ చిన్నదాని చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈగల్‌, టిల్లు స్క్వేర్‌ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అంతే కాకుండా తమిళ్‌ లో జయం రవితో(Jayam Ravi) సైరెన్‌ అనే సినిమాలో చేస్తుంది. అటు సినిమాలతో పాటు నిత్యం సోషల్‌ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటుంది అనుపమ.

తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ భామ. తన వ్యక్తిగత ఫోటోలతో పాటు సినిమాలోని పాత్రలకు సంబంధించిన చిత్రాలను కూడా షేర్‌ చేస్తుంటుంది. అంతే కాకుండా వాటికి ఫన్నీ.. ఫన్నీ క్యాప్షన్లు కూడా పెడుతుంటుంది. అయితే ఇప్పుడు తాజాగా అనుపమ.. ఓ ఫోటోను షేర్‌ చేసింది.

దానిని చూసిన అభిమానులంతా ఒక్కసారిగా షాక్‌ కి గురయ్యారు. ఎందుకంటే ఆ ఫోటోలో అనుపమ తన మెడలో ఉన్న తాళిబొట్టును చూపిస్తుంది. దానిని చూసిన అభిమానులంతా అనుపమ సీక్రెట్‌ గా పెళ్లి చేసుకుందని అనుకుంటున్నారు. దీంతో తెగ ఫీల్‌ అయిపోతున్నారు.

కానీ ఆ ఫోటో తన తాజా చిత్రంలోనిది. ఆమె నటిస్తున్న సైరెన్‌(Siren) సినిమా నుంచి ఇటీవల ఓ లిరికల్ సాంగ్‌ రిలీజ్ అయ్యింది. అందులో అనుపమ హీరోను పెళ్లి చేసుకుంటుంది. వాటినే కొన్నిటిని అనుపమ తన సోషల్‌ మీడియాలో ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.

విషయం తెలుసుకున్న అభిమానులు హమ్మయ్య ఈ ఫోటోలు సినిమాలోవా.. నిజంగా పెళ్లి అయ్యిందేమో అని కంగారు పడ్డామని చెప్పుకొచ్చారు.

Also read: మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక ఎన్నికలు ఉండవు: ఖర్గే!

Advertisment
తాజా కథనాలు