Against To Vote BJP : ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీజేపీ పార్టీకి ఓటు వేసినందుకు ఓ ముస్లీం మహిళను ఆమె బంధువు కొట్టడం చర్చనీయాంశమవుతోంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి శివరాజా సింగ్ చౌహన్(Shivraj Singh Chouhan) దృష్టికి వెళ్లడంతో.. ఆయన ఆ ముస్లీం మహిళను కలిసి.. భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని సేహోర్ జిల్లాకి చెందిన సమీనా బీ (30) అనే మహిళ బీజేపీ సంబరాల్లో పాల్గొంది. ఇది చూసి బావ జావేద్ ఖాన్ మండిపడ్డాడు. సమీనా బీజేపీ(BJP) కి ఓటు వేసినట్లు చెప్పడంతో కర్రతో కొట్టాడు. దీంతో గాయాలపాలైన సమీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కొట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న తన బావపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరింది.
Also Read: విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి.. అడ్డొచ్చిన తండ్రి, సోదరుడిపై దారుణం
అయితే ఈ వ్యవహారంపై సమీనా మీడియాతో కూడా మాట్లాడింది. శివరాజ్ సింగ్ చౌహన్ ఏ తప్పు చేయలేదని.. అందుకే తాను బీజేపీకి ఓటు వేసినట్లు పేర్కొంది. అలాగే ఇకపై బీజేపీకే ఓటు వేస్తానని కూడా సీఎంకు చెప్పినానని తెలిపింది.
Also Read: ఈసీఐఎల్ లో 363 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు!