Bear found in Kadapa District: జనావాసాల మధ్యలోకి ఎలుగుబంటి
సిద్ధవటం ప్రాంతం లంకమల అభయారణ్యంలో చిరుతలు(Leopard) ఎలుగుబంట్లు(Bear) ఎక్కువ ఉండడంతో అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. ఎటునుంచి ఏ జంతువులు ఊరిలోకి వస్తుందోనని ఓ కంట కనిపెడుతూ ఉంటారు. బుధవారం తెల్లవారుజామున అభయారణ్యం నుంచి జనావాసాల మధ్యలోకి వచ్చిన ఒక ఎలుగుబంటి అలజడి సృష్టించింది . సిద్ధవటం మండల కేంద్రమైన గ్రామచావీడు గ్రామంలో ఎలుగు బంటి హల్‌చల్ చేసింది. కుక్కలు వెంటబడటంతో జనావాసాల మధ్యలో ఊరి నడుమనున్న ఓ చెట్టు పైకెక్కి కూర్చుంది.
అటవీశాఖ ప్రయత్నాలు
మరోవైపు అటవీ శాఖ అధికారి కళావతి నేతృత్వంలో ఎలుగు బంటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగించారు. ప్రధాన రహదారి వద్ద చెట్టుపై దర్జాగా కూర్చున్న ఎలుగుబంటిని అధికారులు అడవిలోకి పంపించే ప్రయత్నం చేశారు. సమీపాన ఉన్న ఇళ్ళకు తాళాలు వేయించి డేరాలతో పట్టుకోనేందుకు అటవీశాఖ ప్రయత్నాలు చేశారు రైంజర్ కళావతి ఇబ్బంది. అధికారుల ప్రయత్నాల ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. లేదంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే. చెట్టు దిగకపోవడంతో గ్రామస్థులల్లో భయాందోళన నెలకొంది.
హాని కలగకుండా చర్యలు
నిన్న (ఆగష్టు 1) తిరుమల(Tirumala) కాలినడక మార్గంలో ఎలుగుబంటి హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జింకల పార్కు సమీపంలో ఎలుగుబంటి సంచరించింది. మెట్ల మార్గంలో ఒక వైపు నుంచి మరో వైపు దాటి పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది. గత నెలలో మూడు సంవత్సరాల బాలుడిపై చిరుత పులి దాడి చేసిన ఘటన మరవక ముందే.. ఇప్పుడు ఎలుగుబంటి ప్రత్యక్షం కావటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. చిరుత పులి దాడి అనంతరం అధికారులు ఆ చిరుతపులిని పట్టి బంధించగా.. ఇప్పుడు మళ్లీ ఎలుగుబంటి జాడలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భద్రత సిబ్బంది, అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సైరన్లు మోగిస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి హాని కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపినా.. భక్తుల్లో మాత్రం భయం అనేది ఎక్కువైంది.