Apple Seeds: రోజుకో యాపిల్ (Apple) తింటే డాక్టర్ నుంచి దూరంగా ఉండొచ్చని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అలాగే పెద్దవారు నుంచి చిన్న పిల్లల వరకు యాపిల్ తినేందుకు ఇష్టపడుతుంటారు. అలాగే చిన్నపిల్లలకు 6 నెలల వయసు నుంచే యాపిల్ ని ఊడకబెట్టి మెత్తగా చేసి పెడుతుంటారు.
ఎవరింటికైనా వెళ్లినప్పుడు కూడా చాలా మంది యాపిల్స్ తీసుకుని వెళ్తారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ ఎక్కువగా యాపిల్ ని తినమని చెబుతుంటారు. ఖరీదు ఎక్కువైనప్పటికీ కూడా యాపిల్స్‌ని చాలా మంది కొంటుంటారు. యాపిల్స్ తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని తెలుసు.
అధికంగా తీసుకుంటే ప్రమాదం..
కానీ యాపిల్ లోని గింజలను తినడం వల్ల అంతకు మించిన ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాపిల్ లో ఒకటి రెండు గింజలు తింటే పెద్ద సమస్య ఏమి కాదు కానీ అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం ప్రాణపాయంలో పడినట్లే అంటున్నారు వైద్య నిపుణులు. యాపిల్ గింజల్లో అమిగ్డాలిన్ అనే పదార్థం ఉంటుంది.
ఈ గింజలు పొట్టలోకి చేరి జీర్ణ ఎంజైమ్ లతో కలిసి సైనైడ్ ను విడుదల చేస్తాయి. ఇవి శరీరంలోకి చేరాక హైడ్రోజన్ సైనైడ్ గా మారుతాయి. ఇలా మారడంతోనే శరీరంలోని ముఖ్యమైన భాగాలను దెబ్బ తీస్తుంది. మనిషిని అనారోగ్యానికి గురి చేస్తుంది. అధిక మోతాదులో యాపిల్ గింజలు శరీరంలో చేరితే సైనైడ్ అధికంగా రిలీజ్ అవుతుంది.
ప్రాణాలు కూడా పోవచ్చు..
యాపిల్ గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందని వైద్యులు తెలుపుతున్నారు. అధిక మోతాదులో యాపిల్ గింజలను తీసుకోవడం వల్ల ప్రాణాలు పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక కప్పు యాపిల్ గింజలు తింటే గుండె, మెదడు పైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.
కొన్ని సందర్భాల్లో యాపిల్ గింజలను తీసుకోవడం వల్ల కోమాలోకి కూడా వెళ్తారు. ఇలా పరతిరోజూ యాపిల్ గింజలను తీసుకోవడానికి అలవాటు పడితే లోబీపీ, శ్వాస పూర్తిగా అందకపోవడం, వికారం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. యాపిల్స్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా చిన్నపిల్లలు యాపిల్స్‌ను తినే విషయంలో పెద్దవారు జాగ్రత్త వహించాలి. పిల్లలు పొరపాటున గింజలు మింగిన పెద్ద ఇబ్బంది లేదు కానీ..నమిలి మింగితేనే చాలా కష్టం.
Also read: అంగన్వాడీలకు షాక్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ