Viral Video: టీమిండియా దివాళీ సెలబ్రేషన్స్...ట్రెడిషనల్ లుక్‎లో అదరగొట్టిన ఆటగాళ్లు..!!

బీసీసీఐ టీమ్ ఇండియా ఆటగాళ్ల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆటగాళ్లు దీపావళిని ఆడంబరంగా జరుపుకున్నారు. ట్రెడిషనల్ లుక్ లో అదుర్స్ అనిపించారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video:  టీమిండియా దివాళీ సెలబ్రేషన్స్...ట్రెడిషనల్ లుక్‎లో అదరగొట్టిన ఆటగాళ్లు..!!
New Update

ప్రపంచ కప్ 2023లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి టీమ్ ఇండియా అభిమానులకు దీపావళి కానుకను అందించింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు బెంగళూరులో భారత జట్టు ఆటగాళ్లు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దివాళీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆటగాళ్లు సాంప్రదాయ లుక్‌లో అదుర్స్ అనిపించారు.

భారత ఆటగాళ్లు ఘనంగా సంబరాలు చేసుకున్నారు:

భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్‌కు ఒకరోజు ముందు టీమిండియా ఆటగాళ్లు, సిబ్బంది దీపావళి వేడుకలు జరుపుకున్నారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో దీపావళి వేడుకను ఏర్పాటు చేశారు. ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆటగాళ్లు, సిబ్బంది తమ భార్యలతో కలిసి కనిపించారు. విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కనిపించగా, రోహిత్ కూడా తన భార్యతో పార్టీకి చేరుకున్నాడు.

ఇషాన్ కిషన్ ఫన్ మూడ్ లో కనిపించాడు:

బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ కూడా సరదాగా కనిపించాడు. వాస్తవానికి, శార్దూల్ ఠాకూర్, శుభ్‌మాన్ గిల్ ఒకే విధమైన దుస్తులు ధరించి వచ్చారు, ఇషాన్ కిషన్ ఇద్దరు ఆటగాళ్లతో సందడి చేశాడు. వీరంతా కలిసి ఫోటోషూట్ కూడా చేసారు. టీమ్ ఇండియా ఆటగాళ్లకు సంబంధించిన ఈ వీడియోను అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ట్రోఫీపైనే టీమిండియా చూపు :

2023 ప్రపంచకప్‌లో వరుసగా 9 మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది.

ఇది కూడా చదవండి: ఏం బతుకురాయ్యా మీది…చిన్న దేశం కూడా ఛీ కొడుతోంది..!!

#viral-video #diwali #team-india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe