Cricket: ఒక్కో మ్యాచ్‌కూ 45 లక్షలు..బీసీసీఐ కీలక ప్రకటన

ఇండియన్ క్రికెటర్స్‌లో కచ్చితంగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సిందేనని బీసీసీఐ ఇంతకు ముందే ప్రకటించింది. ఇప్పుడు ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కూ 45 లక్షలు ఇస్తామంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జైషా కీలక ప్రకటన చేశారు. టెస్ట్ క్రికెట్‌లో ఇన్సెంటివ్ స్కీమును ప్రవేశపెడుతున్నామని తెలిపారు.

New Update
Cricket: ఒక్కో మ్యాచ్‌కూ 45 లక్షలు..బీసీసీఐ కీలక ప్రకటన

BCCI Announcement Of Test Cricket Matches: నేటి యువతరం క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం మీద ఆసక్తి చూపించడం లేదు. ఐపీఎల్ అంటేనే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లో మన ఆటగాళ్ళు బాగా వెనుకబడిపోతున్నారు. నిలకడ ఆటను మర్చిపోతున్నారు. ఇది అరికట్టడానికి బీసీసీఐ చర్యలు చేపట్టింది. ప్రతీ ఆటగాడు కచ్చితంగా రంజీలు ఆడాల్సిందేనంటూ కండీషన్ పెట్టింది. ఇప్పుడు తాజాగా ఆటగాళ్ళకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆటగాళ్ళను ఆర్ధికంగా నిలబెట్టేందుకు...వారి ఆదాయంలో నిలకడ ఉండేలా తోడ్పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. 2022-23 సీజన్‌ నుంచి టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమును అమలు చేస్తామని...టెస్ట్ క్రికెట్ ఆడేవాళ్ళకు అదనపు రివార్డు ఇస్తామని తెలిపారు.

ఒక్కో మ్యాచ్‌కూ 45 లక్షలు..

దీని ప్రకారం టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన వాళ్ళకు బీసీసీఐ ఇంటెన్సివ్స్ ఇస్తుంది. అవికూడా ఎలా అంటే..ఒక సీజన్‌లో టీమిండియా షెడ్యూల్‌లో తొమ్మది టెస్ట్‌లు ఉంటే ఇందులో నాలుగు కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు ఇన్సెంటివ్స్ ఉండవు. ఆ తరువాత 5-6 మ్యాచ్‌లలో తుది జట్టులో భాగమై ఆడితే 30 లక్షల చొప్పున...బెంచ్‌కు పరిమితమైతే 15 లక్షల చొప్పున ఇస్తారు. అలాగే 7 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే 45 లక్షలు చెల్లిస్తారు. జట్టులో ఉండి బెంచ్‌కే పరిమితమైతే 22.5 లక్షల చొప్పున చెల్లించనున్నారు.

ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సీరీస్‌లో టీమ్ ఇండియా 4-1తో సీరీస్‌ను సొంతం చేసుకుంది. మొదటి టెస్ట్ మ్యాచ్‌ను మాత్రమే ఇంగ్లాండ్ గెలిచింది. కానీ మిగిలిన నాలుగు టెస్ట్‌లనూ భారత్ తన కాతాలో వేసుకుంది. ఆఖరి నామమాత్రపు మ్యాచ్‌లో కూడా టీమ్ ఇండియా 64 పరుగుల తేడాతో గెలుపొందింది.

Also Read:Movies : గామి సాలిడ్ హిట్.. ఒక్కరోజులో 9.07కోట్లు

Advertisment
తాజా కథనాలు