Rishabh Pant is Fit to Play IPL 2024 - BCCI: టీమ్‌ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) రీ ఎంట్రీపై బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. తేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి 14 నెలలుగా గ్రౌండుకు దూరంగా ఉన్న రిషబ్.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. అయితే మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL 2024) మొదలుకానుండగా ఢిల్లీ కెప్టెన్ ఎవరనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రిషబ్ బరిలోకి దిగబోతున్నాడంటూ బీసీసీఐ వెల్లడించింది.
పూర్తి ఫిట్‌గా ఉన్నాడు..
ఈ మేరకు ఐపీఎల్- 2024 సీజన్‌కు పంత్ బ్యాటర్, వికెట్‌కీపర్‌గా పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. పంత్ త్వరలోనే దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) శిబిరంలో చేరనున్నాడు. ఎడమ కాలి మోకాలుకు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ప్రసిద్ధ్ కృష్ణ, కుడికాలి చీలమండకు సర్జరీ చేయించుకున్న మహ్మద్ షమిలు ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అయ్యారు' అని బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
అభిమానుల్లో టెన్సన్..
ఇక ప్రసిద్ధ్ రాజస్థాన్ రాయల్స్‌కు, షమి గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరి స్థానాల్లో ఆ ఫ్రాంఛైజీలు ఎవరిని తీసుకుంటారనే విషయంపై అభిమానుల్లో టెన్సన్ మొదలైంది. ఇదిలావుంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్-17 మార్చి 22 నుంచి ప్రారంభమవుతుంది. 22న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మధ్య జరగననున్న మ్యాచ్‌తో ఈ ధానాధన్ లీగ్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌లో భాగమయ్యే అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలెట్టేశాయి. ఇక పంత్ ఎంట్రీపై ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. తమ్ముళ్లు పక్కకు తప్పుకోండి పంత్ వస్తున్నాండంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఆధార్ ఉచిత అప్ డేట్.. గడువును మరో 3 నెలలు పొడిగించిన ఉడాయ్