Duleep Trophy: దేశీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది దులీప్ ట్రోఫీ. ఇందులో పెద్దా, చిన్నా క్రికెట్లర్లందరూ ఆడతారు. ఈసారి కూడా నలుగురు తప్పించి అందరూ ఆడుతున్నారు. దాంతో పాటూ ఈసారి దులీప్ టోర్నీ ఫార్మాట్‌ను కూడా మార్చారు. ఈట్రోఫీ 1961లో మొదలైంది. దులీప్ ట్రోఫీ ఇది వరకు ఆరుజట్లతో జోనల్ ఫార్మాట్‌లో జరిగేది. అయితే ఈసారి ఈ ఫార్మాట్‌కు ఎండ్ పలకాలని నిర్ణయించింది బీసీసీఐ. అందుకే 2024 దులీప్ ట్రోఫీని నాలుగు జట్లతో నిర్వహించనుంది. జట్లకు టీమ్ ఎ, టీమ్ బి, టీమ్ సి, టీమ్ డి అని పేర్లు పెట్టింది. నాకౌట్ మ్యాచ్‌లు లేకుండా రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో మ్యాచ్‌లను నిర్వహించనుంది. ఈ పద్ధతిలో ప్రతి జట్టు మిగిలిన అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న జట్ను విజేతగా ప్రకటిస్తారు. ఇది టెస్ట్ మ్యాచ్‌లకు సంబంధించిన ట్రోఫీ కావున.. ఒక్కో మ్యాచ్ నాలుగు రోజులపాటు జరగనుంది. సెప్టెంబరు 19 (చెన్నై), 27 (కాన్పూర్)న బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే రెండు టెస్టులకు దులీప్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేస్తామని బీసీసీఐ ప్రకటించింది. దులీప్ ట్రోఫీ ఫామాట్‌ను మార్చడం దేమీ కొత్త ఆదు. ఇప్పటికి ఐదు, ఆరుసార్లు మార్చింది బీసీసీఐ.
ఇక 2024 సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కాబోతున్న దులీప్ ట్రోఫీ షెడ్యూల్ ను రెండు రోజుల క్రితమే బీసీసీఐ ప్రకటించింది. అలాగే ఈ ట్రోఫీలో పాల్గొనబోయే జట్ల వివరాలను సైతం వెల్లడించింది. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు మినహా మిగిలినవారంతా దులీప్ ట్రోఫీ ఆడనుండగా.. సెప్టెంబర్ 22 వరకు ఈ ట్రోఫీ జరగనుంది. మొదటి రౌండ్‌లో A, B, C, D అనే నాలుగు జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో తలపడనున్నాయి.
Team A: శుభమన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, విద్వాత్ కావరప్ప, కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.
Team B: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జగదీషన్ (వికెట్ కీపర్), యశ్ దయాల్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి, ముఖేష్ కుమార్.
Team C: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, మయాంక్ మర్కండే, మయాంక్ మార్కండే (వికెట్ కీపర్), సందీప్ వారియర్, హిమాన్షు చౌహాన్.
Team D: శ్రేయాస్ అయ్యార్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ భరత్ గుప్తా, కెఎస్ (వికెట్‌కీపర్), సౌరభ్ కుమార్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా.
షెడ్యూల్..
సెప్టెంబర్ 5-8 : ఇండియా A vs ఇండియా B – అనంతపురం రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం.
సెప్టెంబర్ 5-8: ఇండియా సి vs ఇండియా డి – అనంతపురం ACA ADCA గ్రౌండ్.
సెప్టెంబర్ 12-15: ఇండియా A vs ఇండియా D – అనంతపురం రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం.
సెప్టెంబర్ 12-15: ఇండియా B vs ఇండియా C – అనంతపురం ACA ADCA గ్రౌండ్.
సెప్టెంబర్ 19-22: ఇండియా A vs ఇండియా C – అనంతపురం రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం.
సెప్టెంబర్ 19-22: ఇండియా B vs ఇండియా D – అనంతపురం ACA ADCA గ్రౌండ్.
Also Read:Vinesh: గుండె మరోసారి ముక్కలైంది– కాస్ తీర్పు మీద వినేశ్ ఎమోషనల్ పోస్ట్