BhavyaSri : సంచలనంగా భవ్యశ్రీ హత్య కేసు..పెనుమూరు ఎస్సైని సస్పెండ్ చేయాల్సిందే..!!

భవ్యశ్రీ హత్య కేసు సంచలనంగా మారింది. ఆమెను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని కుటుంబ సభ్యులతో పాటు స్ధానికులు ఆరోపిస్తున్నారు. భవ్యశ్రీని అతి కిరాతకంగా చంపేసిన ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై నిర్లక్ష్యం చేసి సమయాన్ని వృధా చేస్తున్న పెనుమూరు ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేపట్టారు వడ్డెర సంఘం నేతలు.

New Update
BhavyaSri : సంచలనంగా భవ్యశ్రీ హత్య కేసు..పెనుమూరు ఎస్సైని సస్పెండ్ చేయాల్సిందే..!!

ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి కూడా నిజాన్ని ఎందుకు బయటకు పెట్టడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక రాజకీయ హస్తం ఉందా, లేదా సొమ్ముకు అమ్ముడుపోయారా అనే అనుమానం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు లో న్యాయం జరిగేంత వరకు తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలని కోరారు. మహిళా కమిషన్ ఏమైందని, పద్మజ మేడం ఎక్కడికెళ్ళిందని, పరామర్శించడానికి రాకపోవడంలో ఆంతర్యం ఏమిటని అనుమానాన్ని వ్యక్తం చేశారు. భవ్య అత్యాచార హత్య సంఘటనపై ఈరోజు సోమవారం క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. భవ్య కేసు ను తీవ్రంగా పరిగణిస్తూ దిశా చట్టం మాదిరి భవ్య చట్టాన్ని తేవాలన్నారు. పేద వర్గాలకు చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు? భవ్య కేసు పై ఎస్పీ తో పాటు సి.బి.ఐ కూడా విచారణ చేపట్టాలని కోరారు.

అయితే, భవ్యశ్రీకి నలుగురు అబ్బాయిలు ప్రపోజ్ చేయగా.. వారికి నో చెప్పిందని ఒక ప్రచారం జరుగుతోంది. వారే ఇంతటి కిరాతకానికి పాల్పడినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. తమను కాదన్నందుకు ఆగ్రహంతోనే.. పక్కా ప్లాన్ ప్రకారం భవ్య శ్రీని కిడ్నాప్ చేసి, ఇంతటి దారుణానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. భవ్యశ్రీ పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ.. ఏం జరిగింది అనేది తెలియని పరిస్థితి ఉంది.

Also Read: మిస్టరీగా భవ్యశ్రీ మృతి.. చంపింది ఆ ముగ్గురేనా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెరు?

Advertisment
Advertisment
తాజా కథనాలు