IMD : బంగాళాఖాతంలో మరో తుఫాన్‌!

నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది.గురువారం ఉదయం నుంచి మధ్య బంగాళాఖాతంలో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

New Update
Rains: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్..!

Rain Alert : నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనున్నది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించింది. గురువారం ఉదయం నుంచి మధ్య బంగాళాఖాతంలో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

శుక్రవారం వరకు సముద్రం పరిస్థితి కూడా చాలా ఉధృతంగా ఉండే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి.శుక్ర, శనివారాల్లో బాలాసోర్‌, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్‌ తెలిపారు.

శనివారం రాత్రి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ (West Bengal) మధ్య తీరం దాటుతుందని, తుఫానుగా మారి ఒడిశాతీరం దిశగా పయనించే అవకాశం కూడా ఉందని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వానలు (Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ ఇష్యూ చేసింది.

Also read: జులై 4నే యూకే ఎన్నికలు.. తొలిసారి ఓటర్లను ఎదుర్కొనున్న రిషి!

Advertisment
తాజా కథనాలు