ఇటీవలే ఎల్టక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ BattRE 'స్టోరీ ఎపిక్' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది. ప్రతీరోజు సిటీలో ప్రయాణం చేసేవారికి ఇది బెస్ట్ స్కూటర్ అని చెప్పొచ్చు. ఈ ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ఠ వేగం గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇక కంపెనీ తమ స్కూటర్ బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 30 వేల కిలోమీటర్ల వారంటీని ఇస్తోంది. దీనిగురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
ఆ ఇబ్బంది ఉండదు : స్టోరీ ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.84,999గా ఉంది. ఇది 60V 40Ah బ్యాటరీ ప్యాక్ IP67-రేటెడ్‌ను కలిగి ఉంది. అలాగే దుమ్ము, నీటి నుంచి రక్షణగా ఉంటుంది. ఇందులో బ్యాటరీ సెఫ్టీ కోసం లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. బ్యాటరీ ప్యాక్‌ను కూడా వేరు చేయగలదు. అంతేకాదు ఎలక్ట్రిక్ సాకెట్ లేకపోయినా పార్కింగ్ స్థలంలో ఛార్జ్ చేసేందుకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం బ్యాటరీని మాత్రమే తీసుకువెళ్లీ ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది దూరం, బ్యాటరీ ఉష్ణోగ్రత, ఛార్జింగ్ సమయం వంటి సమాచారాన్ని చూపిస్తుంది. ఇక స్కూటర్ బాడీని మొత్తం మెటల్‌తో తయారు చేశారు. బ్యాటరీ ప్యాక్‌ని పూర్తిగా ఛార్జ్ చేసేందుకు దాదాపు ఐదు గంటల వరకు టైమ్ పడుతుందని కంపెనీ చెబుతోంది.
కలర్స్
ఈ కొత్త స్టోరీ ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పలు రంగుల్లో అందుబాటులో ఉంది. క్యాండీ రెడ్, స్టార్‌లైట్ బ్లూ, ఎక్రూ ఎల్లో, స్టార్మీ గ్రే, పెరల్ వైట్, కాస్మిక్ బ్లూ, గన్‌మెటల్, ఐస్ బ్లూ హంటర్ గ్రీన్ బ్లాక్, గోల్డ్ రష్, బ్లేజింగ్ బ్రాంజ్, మిడ్‌నైట్ బ్లాక్ వంటి 12 రంగుల్లో దొరుకుతోంది. ఇదిలాఉండగా ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, డిజీల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో వీటి నిర్వహణ ఖర్చు పెరుగుతోంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ వాటి తయారీ కంపెనీలు కూడా పెరుగుతున్నాయి. సరికొత్త ఫీచర్లతో తమ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
Also Read : తెలంగాణలో రుణమాఫీపై రచ్చ.. ఎవరి వాదన కరెక్ట్?