లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి బీజేపీ సీనియర్ నేత ఓం బిర్లా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారనే ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇండియా కూటమి కూడా డిప్యూటీ స్పీకర్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీకి డిప్యూటి స్పీకర్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే బాపట్ల నుంచి ఎంపీగా గెలిచిన మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్‌కు ఈ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఊహించని షాక్ ఇచ్చిన టీడీపీ!
ఇటీవల తెలంగాణలో బీజేపీ నుంచి వరంగల్ టిక్కెట్ కోసం కృష్ణ ప్రసాద్ తీవ్రంగా ప్రయత్నంగా అది దక్కలేదు. చివరికి ఏపీలో బాపట్ల టిక్కెట్ కోసం దక్కించుకొని విజయం సాధించారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలకంగా మారింది. ఇప్పటికే ఈ పార్టీకి ఒక కేంద్ర మంత్రి, మరకటి కేంద్ర సహాయ మంత్రి పదవులు దక్కాయి. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా టీడీపీకి ఇచ్చేందుకు మోదీ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం.
Also Read: ఏపీలో హడలెత్తిస్తున్న చిరుతలు.. భయాందోళనలో బ్రతుకుతున్న ప్రజలు.!