PAK vs BAN: పాక్‌కు షాక్ ఇచ్చిన బంగ్లా.. తొలి జట్టుగా రికార్డు!

బంగ్లాదేశ్ టీమ్ టెస్టుల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలిసారి పాకిస్థాన్ గడ్డపై పాక్‌ను ఓడించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అంతేకాదు పాక్‌ను తమ గడ్డపై 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లా 1-0 అధిక్యంలో ఉంది.

PAK vs BAN: పాక్‌కు షాక్ ఇచ్చిన బంగ్లా.. తొలి జట్టుగా రికార్డు!
New Update

PAK vs BAN: బంగ్లాదేశ్ టీమ్ టెస్టుల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్ ను 10 వికెట్ల తేడాతో ఓడించిన బంగ్లాదేశ్‌.. తొలిసారి పాకిస్థాన్ గడ్డపై పాక్‌ను ఓడించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అంతేకాదు పాక్ ను తమ గడ్డపై పది వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.

అదరగొట్టిన బంగ్లా బ్యాటర్లు..
తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 448/6 వద్ద డిక్లేర్‌ చేయగా.. బంగ్లాదేశ్‌ బ్యాటర్లు అదరగొట్టడంతో 565 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 23/1తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్థాన్‌ 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. బంగ్లా బౌలర్లు మెహదీ హసన్‌ మిరాజ్‌ (4/21), షకీబ్ అల్ హసన్‌ (3/44) పాక్‌ను రెండో ఇన్నింగ్స్ లో చావు దెబ్బ తీశారు.

మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ (191; 341 బంతుల్లో) కీలకపాత్ర పోషించాడు. షాద్మాన్ ఇస్లాం (93) తృటిలో సెంచరీ మిస్‌ చేసుకోగా.. మోమినుల్ హక్ (50), లిటన్ దాస్‌ (56), మెహదీ హసన్ (77) అర్ధ శతకాలు సాధించారు. మొదటి ఇన్నింగ్స్‌లో పాక్‌ బ్యాటర్లు సౌద్‌ షకీల్ (141), మహ్మద్‌ రిజ్వాన్‌ (171) శతకాలు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ ఓపెనర్‌ అబ్దుల్లా షఫిక్ (37), వికెట్‌కీపర్‌ మహ్మద్ రిజ్వాన్ (51) మాత్రమే రాణించారు. రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లగా.. ఆగస్టు 30 నుంచి ఇదే వేదికలో రెండో టెస్టు జరగనుంది.

#pakistan #test-series #pak-vs-bangladesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe