Bangladesh: బంగ్లాదేశ్‌ ప్రధాని ఇంట్లో అల్లరిమూకల విధ్వంసం.. లండన్‌కు షేక్ హసీనా !

బంగ్లాదేశ్‌లో ప్రధాని ఇంట్లో చొరబడ్డ ఆందోళనకారులు.. ఫుడ్ ఐటెమ్స్‌, ల్యాప్‌టాప్స్‌, వంటపాత్రలను ఎత్తుకెళ్తున్నారు. మరికొందరు ఫర్నీచర్, టీవీ, వాహనాలను ధ్వంసం చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి.. ఢిల్లీకి చేరుకున్న హసీనా లండన్‌ పారిపోనున్నట్లు తెలుస్తోంది.

Bangladesh: బంగ్లాదేశ్‌ ప్రధాని ఇంట్లో అల్లరిమూకల విధ్వంసం.. లండన్‌కు షేక్ హసీనా !
New Update

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ప్రధాని ఇంట్లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టిస్తున్నారు. నివాసంలోకి చొరబడిన వందలాది మంది ఆందోళనకారులు ఇంట్లోని వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ఫుడ్‌ ఐటెమ్స్, బెడ్‌, పెంపుడు జంతువులను సైతం ఎత్తుకెళ్లారు. అలాగే ల్యాప్‌టాప్స్‌, వంటపాత్రలను కూడా వదలడం లేదు. మరికొందరు ఫర్నీచర్, టీవీ, వాహనాలన ధ్వంసం చేశారు. అవామీ లీగ్‌పార్టీ కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు.

Also Read: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. హై అలర్ట్‌ ప్రకటించిన బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌

ఇదిలాఉండగా.. ఈ ఘటన జరగకముందే ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి పారిపోయింది. ప్రస్తుతం ఆమె భారత్‌లోని ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె అక్కడి నుంచి లండన్‌కు పారిపోతున్నట్లు సమాచారం. మరోవైపు బంగ్లాదేశ్‌ అల్లర్లలో ఇప్పటివరకు 300 మందికి పైగా మృతి చెందారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో సైనిక పాలన దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అన్నీ పార్టీలను సంప్రదిస్తున్నామని.. త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రకటించారు.

Also Read: ప్రయాణికురాలి తలలో పేలు.. ఫ్లైట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

#telugu-news #sheikh-hasina #bangladesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe