Bangladesh: ఇండియా సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు బంగ్లాదేశీయుల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తమ దేశంలో తాము ఉండేందుకే చాలా మంది భయపడుతున్నారు. దీంతో పక్క దేశాలకు వలసలు పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. By Manogna alamuru 07 Aug 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bangaldesh people: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇంకా సరి అవ్వలేదు. గత కొన్ని రోజులుగా అక్కడ మారణకాండ జరుగుతోంది. గవర్నమెంట్ పడిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ బంగ్లాదేశీయుల్లో ఆందోళన మాత్రం తగ్గలేదు. వారిలో భయం పోలేదు. దీనివల్లనే త దేశంలో ఉండేందుకు వారు ఇష్టం చూపించడం లేదు. పక్క దేశాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. ఇందులో భాగంగా భారతదేశానికి కూడా బంగ్లాదేశీయులు పోటెత్తుతున్నారు. దీంతో సరిహద్దుల్లో బెంగాలీలు కుప్పలుతెప్పలుగా పోగవుతున్నారు. పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయిగుడీ జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుకు వందలాది మంది బంగ్లాదేశీయులు బారులు తీరినట్లు వెల్లడైంది. మరోవైపు బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు ఇంకా అదుపులోకి రాలేదు. అక్కడ కొన్ని వర్గాలకు చెందిన కంపెనీలు, వ్యాపార సంస్థల మీద, ఇళ్ళ మీద దాడులు జరుపుతూనే ఉన్నారు. దీంతో వాళ్ళందరూ భారత్ సరిహద్దులకు చేరుకుంటున్నారు. బంగ్లాదేశ్‌ని పంచగఢ్ జిల్లాలోని ఐదు జిల్లాలు పశ్చిమ బెంగాల్‌లో జల్‌పాయిగుడీ సరిహద్దుల్లోనే ఉంటాయి. జల్‌పాయిగుడీలోని దక్షిణ్ బెరూబారీ గ్రామంలో ఉన్న ఔట్‌పోస్టుకు చేరుకున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ , స్థానికలకు తమ బాధలు చెప్పుకుంటున్నారు బంగ్లాదేశీయులు. స్వదేశంలో నెలకొన్న భయానక పరిస్థితులను వివరించారని స్థానికులు చెప్పారు. కానీ ఇండయా సెక్యూరిటీ ఫోర్స్ వారిని అనుతించలేదు. దీంతో కొంతసేపటి తరువాత బంగ్లా సెక్యూరిటీ ఫోర్స్ వచ్చి వారిని తిరిగి తీసుకెళ్లింది. Also Read: Vinesh Phogat: ఇదంతా ఆటలో భాగం..వినేశ్ ఫోగాట్ #bangladesh #india #boarder మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి