Bangladesh: భారత్‌ వల్లే బంగ్లాలో వరదలు.. వంకరబుద్ధి పోనిచ్చుకోలేదంటూ విమర్శలు!

రాజకీయ సంక్షోభంతో కుదేలవుతున్న బంగ్లాదేశ్‌పై ప్రకృతి విరుచుకుపడుతోంది. వానలు, వరదలతో బంగ్లా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే భారత్‌ వల్లే వరదలు సంభవించాయని కొందరు బంగ్లాదేశీయులు ప్రచారం చేస్తున్నారు. దీంతో వంకర బుద్ధి పోనిచ్చుకోలేదంటూ భారతీయులు మండిపడుతున్నారు.

New Update
Bangladesh: భారత్‌ వల్లే బంగ్లాలో వరదలు.. వంకరబుద్ధి పోనిచ్చుకోలేదంటూ విమర్శలు!

India Vs Bangaladesh: కుక్క తోక ఎంత వంకరో బంగ్లాదేశ్‌లో కొందరి బుద్ది కూడా అంతే వంకర! ఆపద సమయంలో బంగ్లాదేశ్‌కు అండదండలు అందించే ఇండియాపై బంగ్లాదేశ్‌లో కొందరు నిత్యం విషం చిమ్ముతూనే ఉంటారు. అసలే రాజకీయ సంక్షోభంతో కుదేలవుతున్న బంగ్లాదేశ్‌పై ప్రకృతి విరుచుకుపడుతోంది. వానలు, వరదలతో బంగ్లాదేశ్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు ఏం చేయాలో అర్థం అవ్వక అక్కడి అధికారులు తర్జనభర్జన పడుతుంటే మరోవైపు కొందరు మాత్రం ఈ వరద నష్టాన్ని కూడా ఇండియాపై తోసేస్తున్నారు. భారత్‌ వల్లనే బంగ్లాదేశ్‌లో వరదలు సంభవించాయని అడ్డగోల్ ప్రచారం చేస్తున్నారు.

వరదలకు ఇండియానే కారణమంటూ..
బంగ్లాదేశ్‌లో భారీ వరదలు దాదాపు 18 లక్షల మందిని ప్రభావితం చేశాయి. 30 మందికిపైగా ప్రాణాలు విడిచారు. అయితే ఈ వరదలకు ఇండియానే కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త్రిపురలోని గుమ్టి నదిపై డుంబూర్ డ్యామ్‌ గేట్లను భారత్‌ ఒక్కసారిగా తెరవడంతోనే బంగ్లాదేవ్‌ భారీ వరదలకు కారణమని సోషల్‌మీడియాలో వేల సంఖ్యలో పోస్టులు కనిపిస్తున్నాయి. అటు పలు బంగ్లాదేశ్‌ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని తన ఛానెల్స్‌లో ప్రసారం చేస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వార్తలు నిజం కాదని భారత్‌ వర్గాలు అంటున్నాయి. ఈ కథనాలను తోసిపుచ్చుతున్నాయి.

డుంబుర్ డ్యామ్ చూపిస్తూ వీడియోలు..
అటు సోషల్ మీడియాలో బంగ్లాదేశీయులు పెడుతున్న పోస్టులు కూడా వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. డుంబుర్ డ్యామ్ అని చూపిస్తూ కొన్ని వీడియోలు పోస్టు చేస్తున్నారు. అయితే, వీడియోలోని ఆనకట్ట నిజానికి డుంబుర్‌ డ్యామ్‌ది కాదు.. తెలంగాణలోని శ్రీశైలం ఆనకట్ట విజువల్స్‌ను పోస్టు చేస్తూ డుంబుర్ డ్యామ్‌గా ఇతరులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఫేక్‌గాళ్లు!

ఇండియా స్ట్రాంగ్ కౌంటర్..
గుమ్టి నది బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే ముందు ఈశాన్య భారత రాష్ట్రం త్రిపుర గుండా ప్రవహిస్తుంది. త్రిపురలో ఉన్న డుంబుర్ ఆనకట్ట బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎగువన ఉంటుంది. అయితే, బంగ్లాదేశ్‌లో వినాశనానికి కారణమవుతున్న వరద డుంబుర్‌ కారణంగా సంభవించింది కాదు. అక్కడి పెద్ద పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చిన నీటి కారణంగా వరద ఉధృతి పెరిగిందని ఇండియా కౌంటర్ ఇస్తోంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌ గమనించాలని విమర్శిస్తోంది.

భారత్‌ తన డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయడం ద్వారా బంగ్లాదేశ్‌లో కృత్రిమ వరదను సృష్టించిందన్న ప్రచారాన్ని అటు అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కొట్టిపారేస్తున్నాయి. ప్రముఖ మీడియా సంస్థ DW.com సైతం ఫ్యాక్ట్ చెక్ చేసి ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు