Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ నిరసనలు.. చీఫ్ జస్టిస్ రాజీనామా

బంగ్లాదేశ్‌లో ఆందోళనకారులు సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ఇతర న్యాయమూర్తులు కూడా దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేశారు. దీంతో చీఫ్ జస్టిస్‌ ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ నిరసనలు.. చీఫ్ జస్టిస్ రాజీనామా
New Update

బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఈసారి ఆందోళనకారులు సుప్రీం కోర్టుపై నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ఇతర న్యాయమూర్తులు కూడా దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేశారు. దీంతో చీఫ్ జస్టిస్‌ ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్.. ఇతర న్యాయమూర్తులతో కలిసి సమావేశానికి పిలుపునిచ్చారు. తాత్కాలిక ప్రభుత్వానికి అనుమతి లేదని వాళ్లు చెప్పబోతున్నారని.. అలాగే ఆయన దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలు వచ్చాయి. దీంతో విద్యార్థులతో పాటు నిరసనకారులు సుప్రీంకోర్టు వద్దకు చేరి ఆందోళనకు దిగారు. దీంతో న్యాయమూర్తులు సమావేశం ఆగిపోయింది. నిరసనకారులు చీఫ్ జస్టిస్ దిగిపోవాలంటూ డిమాండ్లు చేయడంతో ఆయన అంగీకరించాల్సి వచ్చింది.

Also Read: హిండెన్‌బర్గ్‌ నుంచి సంచలన ట్వీట్‌.. అదాని తర్వాత నెక్స్ట్‌ టార్గెట్‌ ఎవరు ?

ఇదిలాఉండగా.. ఇటీవల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి పారిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. తాత్లాకి పరిపాలన యంత్రాంగాని నోబెల్ బహుతి గ్రహీత యూనస్‌ సారథిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో జరిగిన ఆందోళనల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Also Read:  సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం.. మేఘా కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టాలన్న కేటీఆర్‌, ఏలేటి

#chief-justice #supreme-court #bangladesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe