రేపు ఢిల్లీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న బండి సంజయ్.. మోడీతో భేటీ!

రేపు ఢిల్లీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్న బండి సంజయ్. ఉదయం 11 గంటలకు మోడీతో భేటీ. తరువాత హైదరాబాద్ చేరుకొని మధ్యాహ్నం శంషాబాద్ లో మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొననున్న బండి. జోష్ లో ఆయన అనుచరులు, కార్యకర్తలు.

రేపు ఢిల్లీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న బండి సంజయ్.. మోడీతో భేటీ!
New Update

Bandi Sanjay : అనూహ్యంగా టీబీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించబడిన కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్(Bandi Sanjay) రేపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పట్నుంచి ఆయనకు హైకమాండ్ ఎలా న్యాయం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఆయనకు కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంతో ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉదయం బండి ఈ పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.

కాగా, దీనికంటే ముందు ఉదయం 11 గంటలకు బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోడీతో(Narendra Modi) కలిసి ఆయన ఆశీస్సులు అందుకోనున్నారు. తరువాత మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకుంటారు. శంషాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో బండి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పార్టీ ప్రముఖులు, నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది.

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ కార్యవర్గంలో బండికి స్థానం కల్పించడం జరిగింది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కార్యదర్శిగా సత్యకుమార్ ను కొనసాగిస్తున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తనను బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించడంపై బండి స్పందిస్తూ..పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్న తనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం చాలా గర్వంగా ఉందన్నారు. మోడీ, అమిత్ షాలతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తనకు ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్రానికి చెందిన బీజేపీ కార్యకర్తలు, ప్రత్యేకంగా కరీంనగర్ కు చెందిన కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానని బండి తెలిపారు. మరో వైపు బండిని అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో తీవ్ర నిరాశలో ఉన్న ఆయన అనుచరులు, కార్యకర్తల్లో జోష్ నిండుకుంది.

Also Read: ఈ సారి ఎలాగైనా గెలవాల్సిందే భయ్యా..టీ.కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్‌ కమిటీ ప్రకటన.. టీమ్‌లో ఎవరెవరున్నారంటే?

#bjp #bandi-sanjay #narendra-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe