Uttarakhand:ఉత్తరాఖండ్ టన్నెల్ సక్సెస్ వెనుక ఉన్న ఆస్ట్రేలియన్ నిపుణుడు ఉత్తరాఖండ్ టన్నెల్ సిల్ క్యారాలో చిక్కుకుపోయిన 41 మందిని తీసుకురావడానికి 17 రోజుల టైమ్ పట్టింది. దీని కోసం ఎంతో మంది పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు. వీరందరి వెనకా ఉన్నది మాత్రం ఓ ఆస్ట్రేలియన్. అతనే అర్నాల్డ్ డిక్స్. By Manogna alamuru 29 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఉత్తరాఖండ్ టన్నెల్...అక్కడి రెస్క్యూ ఆపరేషన్..17 రోజులుగా భారతదేశమంతా మారుమోగిన విషయం. అందులో చిక్కుకుపోయిన కార్మికులు క్షేమంగా బయటకు రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. చాలా మంది వారిని తీసుకురావడానికి శ్రమపడ్డారు. కానీ అందరి కంటే ఎక్కువ కష్టపడింది ఎవరో తెలుసా..అర్నాల్డ్ డిక్స్ అనే ఆస్ట్రేలియన్. ఈయన ఎంత కష్టపడ్డారు..కార్మికలు క్షేమంగా బయటకు రావడం కోసం ఎంత తపించారు అంటే..చివరి రోజు వారు బయటకు వచ్చేస్తారు అని నమ్మకంగా తెలిసిన తర్వాత అర్నాల్డ్ పరుగు పరుగున వెళ్ళి అక్కడే ఓ గుట్ట మీద పెట్టిన హిందూ దేవుడికి దండం పెట్టుకునేంతగా. ఆ నిమిషం తాను ఎవరు..ఎవరికి కృతజ్ఞతలు చెబుతున్నాడు అనే విషయం మర్చిపోయారు అర్నాల్ట్. కేవలం కార్మికులు బయటకు వస్తున్నారన్న ఆనందం, ఎమోషనల్ ఒక్కటే పని చేశాయి. Also read:ఓటర్ కార్డు లేకపోయినా ఓటేయొచ్చు..ఎలాగో తెలుసా? అర్నాల్డ్ డిక్స్..ప్రపంచప్రఖ్యాత టన్నెల్ ఎక్స్ పెర్ట్. జెనీవా కేంద్రంగా ఇంటర్నేసనల్ టన్నెల్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ ఆసోసియేషన్ అనే సంస్థను నడుపుతున్నారు. టన్నెల ఆపరేషన్స్ లో ఇతను వరలడ్ ఫేమస్. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇతన్నే పిలుస్తారు. ప్రపంచంలో అతిప్రమాదకరమైన సొరంగాల తవ్వకాలు, వాటిలో నిర్మించే కట్టడాలు, సేఫ్టీ మెజర్మెంట్స్ గైడెన్స్ ఇలా అనేక విభాగాల్లో ప్రపంచలోనే టాప్ టెక్నీషియన్ గా ప్రొఫెసర్ గా లీగల్ ఎక్స్ పెర్ట్ గా అనేక విభాగాల్లో ఆర్నాల్డ్ డిక్స్ కి పేరుంది. అర్నాల్డ్ ది నలభై ఏళ్ళ అనుభవం. అందుకే భారత ప్రభుత్వం కూడా ఆయన్నే ర్పించుకుంది. ఆయన ఇచ్చిన సలమాలు, సపోర్ట్‌తోనే కార్మికులను రక్షించుకున్నారు. ఈ నెల ఉత్తరాఖండ్ లో సిల్ క్యారా టన్నెల్ ప్రమాదంలో 41మంది కూలీలు చిక్కుకుపోయారని భారత ప్రభుత్వం ఆర్నాల్డ్ కి కబురు పంపింది. తన టీమ్ తో భారత్ కి వచ్చి పని మొదలుపెట్టిన ఆయనకు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. మొదట ఓ పైపును సొరంగంలోని శిథిలాల్లోకి పంపి కూలీలను పైకి తేవాలని ప్రయత్నించినా డ్రిల్లింగ్ చేస్తున్న అగర్ మెషీన్ బ్లేడ్లు విరిగిపోయాయి. ఆ తరువాత ఆ బ్లేడ్లు కట్ చేసేందుకు మరింత సమయం పట్టింది. మరో వైపు ఆల్టర్నేటివ్ గా సొరంగం పక్కన కొండను సైతం నిలువుగా డ్రిల్ చేయటం మొదలుపెట్టారు. ఈ పనులు అన్నింటిలో కీలకపాత్ర పోషించిన ఆర్నాల్డ్ డిక్స్ ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి కనిపించగానే స్పిరుచ్యువల్ ఎమోషన్ కి లోనయ్యారు. పరుగు పరుగును గుట్ట ఎక్కి అక్కడే ఉన్న దేవుడికి సాగిలపడ్డారు. మనం చేస్తున్న పని మీద డెడికేషన్ ఉండడం ఒక లెక్క...కానీ దాని మీద ప్రాణాలు పెట్టడం...ఎమోషనల్ కనెక్షన్ పెంచుకోవడం అనేది వేరే లెవ్. అందుకే రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న వారందరూ ఆర్నాల్డ్ ఈస్ గ్రేట్ అంటున్నారు. ఆయన తపన, కృషి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. #uttarakhand #tunnel #workers #arnold-dix #rescue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి