Vemulawada: కేసీఆర్ నెక్స్ట్ దందా చంద్రమండలంపై: బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యే ప్రవాసీలతో కలిసి రాజన్న ఆలయానికి విచ్చేశారు. ఆలయ పూజారులు వేద మంత్రోచ్చారణలతో బండి సంజయ్‌కు ఘన స్వాగతం పలికారు. By Vijaya Nimma 26 Aug 2023 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి శివయ్య దర్శనం.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay kumar) వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పలు నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యే ప్రవాసీలతో కలిసి రాజన్న ఆలయానికి విచ్చేశారు. బండి సంజయ్‌కు ఆలయ పూజారులు వేద మంత్రోచ్చారణలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రవాసీలతో కలిసి బండి సంజయ్ కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు బండి సంజయ్‌ను చూసిన భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. Your browser does not support the video tag. ప్రభుత్వం ఏం చేస్తోంది..? వేములవాడ పట్టణంలోని బిమేశ్వర గార్డెన్‌లో బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం రావడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటిస్తున్నారని అన్నారు. బీజేపీ పాలన వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని.. నిరంతరం ప్రజల సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తోందని బండి అన్నారు. బెంగాల్ లాగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పార్టీ మళ్ళీ సగం మందికి టికెట్స్ రావు అని బండి సంజయ్ కామెంట్స్ చేశారు. వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ వాళ్ళకే టికెట్స్ ఇచ్చారని అన్నారు. 30 శాతం కమిషన్ అంటే కేసీఆర్ కుటుంబం, అవినీతి కుటుంబం అంటూ విమర్శలు చేశారు. మళ్ళీ ఎన్నికలు రాగానే అమలు కానీ హామీలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్టంలో కేసీఆర్ కుటుంబం ఎలా కోటీశ్వరులు అయ్యారు?. ఏం బిజినెస్ చేశారు? అని ప్రశ్నించారు. వైన్స్ షాప్ దందాలు చేయడానికి, కేసీఆర్ కుటుంబం, అధికారులు ప్లీజ్ టెండర్ వేయండి అంటూ మార్కెటింగ్ చేశారని విమర్శలు చేశారు. Your browser does not support the video tag. కేసీఆర్ నెక్స్ట్ దందా చంద్రమండలంపై..! చంద్రయాన్ -3 సక్సస్ అయింది..అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం అక్కడ ఎలాంటి దందా చేయవచ్చు? అని ఆలోచన చేస్తున్నారని బండి అన్నారు. కేసీఆర్ దందా నెక్స్ట్ చంద్ర మండలంపై చేస్తాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్-బీఅర్ఎస్ పార్టీ ఒక్కటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్‌కి భయపడే సీఎం సయోధ్యకి వచ్చారని అన్నారు. బిల్లులు ఆమోదం కోసమే గవర్నర్‌తో సీఎం సయోధ్యకు వచ్చారని అన్నారు. నేను సీఎం కావాలని అనుకోవటం లేదు, అనుకునే వాళ్ళు ముర్ఖులన్నారు. ముందు రాక్షన ప్రభుత్వంను తొక్కాలన్నారు. బండి సంజయ్ ఎక్కడి నుండి పోటీ చేసేది అనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. సర్వేలు ఆధారంగా టికెట్ ఇస్తారు. బీజేపీలో లాబియింగ్ ఉండదని తెల్చి చెప్పారు. ఓవైసీ కేసీఆర్ అన్న దమ్ములు.. ఎంఐఎం పార్టీ ముస్లిం వారికి ఎం చేసిందని ప్రశ్నించారు. ఓవైసీ పోటుగాడు చార్మినార్‌కే పరిమితం అయ్యారని అన్నారు. దమ్ముంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలని సవాల్ చేశారు. అధికార పార్టీ దగ్గర ఎంఐఎం డబ్బులు తీసుకోవడం అలవాటే అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా వారు బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యారని బండి సంజయ్ అన్నారు. Your browser does not support the video tag. వేములవాడ రాజన్నను ( Vemulawada Rajanna) దర్శించుకున్న వారిలో కర్నాటక, తమిళనాడు, యూపీ, అసోంకి చెందిన ఎమ్మెల్యేలు సీకే రామస్వామి, బస్వరాజ్, ధర్మేశ్వర్ కోన్వర్, దిగంత కలిత, మునిరాజ్, శశాంక్ త్రివేది, హేమంత తగురియాతోపాటు పార్టీ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. Also Read: రైలులో పేలిన సిలిండర్లు..పెరుగుతున్న మృతుల సంఖ్య..!! #bandi-sanjay #visited #vemulawada-rajanna #bandi-sanjay-visted-rajanna-temple #bandi-sanjay-visted-vemulawada-rajanna-temple #mp-bandi-sanjay మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి