Bandi Sanjay VS KTR: కవిత బెయిల్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

కవితకు బెయిల్ రావడంతో కాంగ్రెస్, ఆ పార్టీ లాయర్ల వల్లే ఇది సాధ్యమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. బెయిల్ రావడం కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల విజయమని సెటైర్లు వేశారు. మరోవైపు బండి వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తారా అంటూ మండిపడ్డారు.

New Update
Bandi Sanjay VS KTR: కవిత బెయిల్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి 7 గంటలకు ఆమె తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. దీంతో బీఆర్ఎస్‌ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కవితకు బెయిల్ రావడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఎక్స్‌ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. కాంగ్రెస్, ఆ పార్టీ లాయర్ల వల్లే కవితకు బెయిల్ రావడం సాధ్యమైందని అన్నారు. కవితకు బెయిల్ రావడం.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల సమిష్టి విజయమని తెలిపారు. కవితకు గతంలో బెయిల్ కోసం వాదించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభకు వెళ్తున్నారని అన్నారు.

Also Read: ఎట్టకేలకు కవితకు బెయిల్.. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటో తెలుసా?

దీంతో బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తారా అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ అని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని చీఫ్ జస్టీస్‌ను కోరుతూ ట్వీట్ చేశారు.

Also Read: కవిత బెయిల్‌పై కేటీఆర్ సంచలన రియాక్షన్.. ఏమన్నారంటే ?

Advertisment
Advertisment
తాజా కథనాలు