Telangana BJP: బండి సంజయ్‌కు మళ్లీ అధ్యక్ష పదవి?

బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ కుమార్ మళ్లీ ఫామ్‌లోకి రానున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసాని ఆయనకు అవకాశం కల్పించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి స్థానంలో బండి సంజయ్‌ను మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తుందట.

New Update
Telangana BJP: బండి సంజయ్‌కు మళ్లీ అధ్యక్ష పదవి?

BJP Decision On Bandi Sanjay : తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ (BJP).. మరో వ్యూహం అమలుకు సిద్ధమైందా? మళ్లీ బండి సంజయ్‌ను రంగంలోకి దించనుందా? బీజేపీ రాష్ట్ర పగ్గాలను మళ్లీ ఆయనకు అప్పగించనుందా? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. కిషన్ రెడ్డి స్థానంలో బండి సంజయ్‌ను మరోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందంటున్నారు. వాస్తవానికి కిషన్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతానని చెప్పారట. అందుకే అంగీకరించిన పార్టీ హైకమాండ్.. ఇప్పుడు ఆ పదవిని మళ్లీ బండికే అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

త్వరలో పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణ (Telangana)పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు.. కేంద్రమంత్రిగా కూడా కిషన్ రెడ్డి ఉన్నారు. అయితే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయాలని యోచిస్తున్నారు. అందుకే.. కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటారని, ఆయన స్థానంలో మళ్లీ బండి సంజయ్ కి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఊహించని విధంగా సీట్లు వచ్చాయి. వాస్తవానికి బీజేపీ 15 నుంచి 20 సీట్లను అంచనా వేసింది. కానీ, 8 స్థానాల్లో గెలుపొందింది.

Advertisment
తాజా కథనాలు