Telangana Election 2023: మీకోసం మళ్లీ వస్తున్నా..దీవించండి: బండి సంజయ్

కరీంనగర్‌లో పాదయాత్రకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. ఈనెల 7న కరీంనగర్ టౌన్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఒకవైపు కరీంనగర్‌లో పాదయాత్ర.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బండి సిద్ధమైయ్యారు.

New Update
Telangana Election 2023: మీకోసం మళ్లీ వస్తున్నా..దీవించండి: బండి సంజయ్

Bandi Sanjay Padayatra: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 7 నుంచి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేయబోతున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, ఆ తరువాత సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. తొలిరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అంబేద్కర్ నగర్‌ (Ambedkar Nagar)లోని 24వ డివిజన్‌లో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు.

ప్రత్యేకంగా హెలికాప్టర్  

ఒకవైపు తన నియోజకవర్గంలో పాదయాత్ర చేయడంతోపాటు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి రావాలంటూ పార్టీ నాయకత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తుండటంతో బండి సంజయ్‌కు ప్రత్యేకంగా హెలికాప్టర్ కేటాయించింది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయాలని కోరింది. మిగిలిన సమయాన్ని తాను పోటీ చేస్తున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించాని సూచించింది. అందులో భాగంగా 8, 9, 10వ తేదీల్లో ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే అంశంపై షెడ్యూల్‌ను రూపొందించింది. తొలిరోజు సిరిసిల్ల, నారాయణపేట, మరుసటి రోజు ఖానాపూర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. దీంతోపాటు బండి భద్రతను ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారుకు అనుమతిచ్చింది.

కార్యకర్తలతో కలిసి నామినేషన్

మరోవైపు బండి సంజయ్ కుమార్ ఈనెల 6న బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధిగా నామినేషన్ (Nomination) వేయనున్నారు. ఆరోజు మంచి ముహూర్తం ఉండటంతో వేద పండితుల సూచనల మేరకు ఆరోజు నామినేషన్ వేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయనున్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు మహిళలు బుద్ది చెబుతారు.. షోలాపూర్‌లో కవిత కీలక వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు