Bandi Sanjay : మహిళలు, గర్భిణీలని చూడకుండా దాడి చేసినా స్పందించరా? దాడి చేసిన వాళ్లను వదిలి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న వాళ్లపై హత్యాయత్నం కేసు పెడతారా?చెంగిచర్ల నిషేధిత ప్రాంతమా?....బారికేడ్లు ఎందుకు పెట్టారు?స్టేట్ మెంట్ పేరుతో మహిళలను గుంజుకుపోయి కొడతారా? కాంగ్రెస్ పాలనలో హిందువులు బతికే పరిస్థితి లేదు.. రోడ్లపై హలీం సెంటర్లు పెడితే అడ్డుకోరు.. గణేష్ మండపాలకు మాత్రం అనుమతి పేరుతో వేధిస్తారా? బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాల్సిందే బాధితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బండి సంజయ్. చెంగిచర్లకు భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు బారికేడ్లు పెట్టి కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట. ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగిన బండి సంజయ్ చెంగిచర్ల పర్యటన
వాళ్లంతా లౌకిక వాదులా?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పేర్కొన్న మైనారిటీ డిక్లరేషన్ అంటే హిందువులపై దాడులు చేయడమేనా? అని బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, గర్భిణీలని చూడకుండా దాడి చేసిన వాళ్లంతా కాంగ్రెస్ ద్రుష్టిలో లౌకిక వాదులా? దాడులు చేసిన దుండుగలను వదిలేసి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న బాధితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడమే లౌకికవాదమా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం మేడ్చల్ జిల్లాలోని చెంగిచర్ల బాధితులను పరామర్శించిన బండి సంజయ్.. అక్కడ పోలీసులు బారికేడ్లు విధించడంపై మండిపడ్డారు.
పాకిస్తాన్ లో ఉన్నమా?
ఈ మేరకు ‘చెంగిచర్ల నిషేధిత ప్రాంతమా? మనం పాకిస్తాన్ లో ఉన్నమా? బంగ్లాదేశ్ లో ఉన్నామా? బాధితులంతా పేదలు. తిండికి లేక అల్లాడుతున్నవాళ్లు. వాళ్లను ఆదుకోవడానికి వచ్చే వాళ్లను కూడా అడ్డుకుంటారా? అంటూ ధ్వజమెత్తారు. చెంగిచర్లలో దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు బండి సంజయ్ వస్తున్నారని తెలియడంతో వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, హిందుత్వ వాదులు తరలివచ్చారు. ‘జై శ్రీరాం’ నినాదాలు చేస్తూ బండి సంజయ్ తో కలిసి బాధితుల వద్దకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన కార్యకర్తలు బారికేడ్లను తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలకు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. తోపులాటలో బండి సంజయ్ పడిపోతుండగా కార్యకర్తలు పట్టుకున్నారు. అనంతరం పోలీసుల ఆంక్షల మధ్య కొద్దిమంది కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ బాధితుల ఇండ్ల వద్దకు వెళ్లి పరామర్శించారు. దాడులకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండి సంజయ్ బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు…
చెంగిచర్లలో మొన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. దురదృష్టం ఏమిటంటే ఇక్కడ జరిగిన వాస్తవాలను బయటకు వెళ్లకుండా పేద ప్రజలదే తప్పు అన్నట్లుగా పోలీసులు, కొందరు చిత్రీకరించే యత్నం చేస్తున్నారు. నిజాం పాలనలో మహిళలను బట్టలిప్పి బతుకమ్మ ఆడించారు. కేసీఆర్ పాలనలో రజాకార్ల పాలనను చూపించారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరమ్మ పాలన ఎట్లుందో ఇప్పుడూ అదే జరుగుతోందన్నారు.
ఇది కూడా చదవండి: Delhi Liquor Scam : నా భర్త ‘లిక్కర్ స్కామ్’ నిజాలు రేపు కోర్టుకు చెబుతారు: సునీత
అసలేం జరిగిందంటే..
హోలీ పండుగ రోజు భక్తి పాటలతో అమ్మవారిని కొలిచే సాంప్రదాయం ఇక్కడి ఎస్టీ సామాజికవర్గ ప్రజలది. కానీ కొందరు రోహింగ్యాకు చెందిన వ్యక్తులు పాటలు ఆపాలంటూ యువకులను బెదిరించారు. వందల మూకుమ్మడిగా బాధితుల ఇండ్లపైకి వచ్చి దాడులు చేశారు. వాళ్ల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నా పెద్దా మహిళలనే తేడా లేకుండా విచక్షణా రహితంగా దాడులు చేశారని బాధితులు తెలిపారు.
ఈ క్రమంలోనే బాధితుల వద్దకు వెళ్లిన సంజయ్.. తెలంగాణలో హిందువుల పరిస్థితి దారుణంగా ఉంది. హిందువులపై దాడులు జరిగితే శాంతి భద్రతల సాకుతో మీడియాలో సైతం చూపడం లేదు. బైంసాలో కూడా ఇదే జరిగింది. కానీ మసీదుపై కొన్ని రాళ్లు పడితే ఏదో జరిగిపోయిందని మీడియాలో చూపారు. పోలీసులు, ప్రభుత్వం చెబితే శాంతిభద్రతల సాకుతో హిందువులపై దాడులు జరిగితే టీవీలో చూపకపోవడం దారుణం. బాధితులు అత్యంత పేదవాళ్లు. నోరు లేని వాళ్లు. పొట్టకూటి కోసం రోజుకు రెండు వందల రూపాయల కూలీకి పనిచేసేటోళ్లు. వాళ్ల ఇండ్లు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో చూశారు. అట్లాంటి వాళ్లపై విచక్షణారహితంగా దాడులు చేస్తే కూడా ప్రపంచానికి మీడియా వాస్తవాలు చూపకపోవడం న్యాయమా? రెండు చేతులెత్తి జోడిస్తున్నా. వాస్తవాలను ప్రపంచానికి చూపాలని కోరుతున్నా అన్నారు.
కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ అంటే ఇదేనా? హిందువులు ఎటైనా పోనీవ్వండి. మైనారిటీలు ఏదైనా చేసుకోవచ్చని ఈ దాడుల ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటున్నారా? పేదలపై దాడులు చేయించడానికే అధికారంలోకి వచ్చారా అని ప్రశ్నించారు. బాధితుల చేతుల్లో మరణాయుధాల్లేవు. దాడులు చేస్తుంటే ఆత్మరక్షణ కోసం అడ్డుకుంటే హత్యాయత్నం కేసు ఎట్లా పెడతారు? సీఐ గోవింద్ రెడ్డి, ఎస్ఐ అనిల్ మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టి చిత్రహింసలు పెడతారా అని మండిపడ్డారు. పైగా ఆయనే కొట్టి ఆయనే పడిపోయి తనను చంపబోతున్నారంటూ ఎదురు కేసులు పెట్టాలని చూస్తున్నారు. అట్లాంటి పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన హిందూ సమాజం గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. మీరు ఓటేసి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ఎవరికి కొమ్ము కాస్తుందో పేదలపై ఏ విధంగా లాఠీ ఛార్జ్ చేసి వేధిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటి వాటిని ఎదుర్కొంటూ పేదలకు అండగా నిలబడ్డ బీజేపీని మతోన్మాద పార్టీ అంటూ ముద్ర వేస్తారా? పేదలపై దాడులు చేసిన ఉన్మాదులు లౌకిక వాదులా?
హిందువులారా కాంగ్రెస్ పాలనలో బతికే పరిస్థితి లేదన్నారు. గణేష్ మండపాలు పెట్టుకోవాలంటూ నానా రకాల అనుమతుల పేరుతో వేధిస్తారు. కానీ రంజాన్ సందర్భంగా హరీస్, హలీం దుకాణాలు రోడ్లపై పెడితే అడ్డుకోరు. గంట గంటకు నమాజ్ పేరుతో విపరీతమైన సౌండ్ పెట్టి వేధిస్తున్నా మేం మాట్లాడకూడదా. కానీ మేం భక్తి పాటలు పెట్టుకుంటే మాత్రం దాడులు చేసినా పట్టించుకోరా? రంజాన్ కు సెలవులిస్తారు. ఉద్యోగులకు టైమింగ్ లో మినహాయింపు ఇస్తారు. కానీ అయ్యప్ప, అంజన్న, శివ మాల ధరించిన భక్తులకు మాత్రం ఎలాంటి మినహాయింపు ఇవ్వరు. ఇదేనా లౌకిక వాదమంటే అని ప్రశ్నించారు.
బాధితులకు పూర్తి న్యాయం చేయాలి. బాధితులపై దాడులు చేసిన సీఐ గోవింద్ రెడ్డి, ఎస్ఐ అనిల్ ను సస్పెండ్ చేయాలి. దాడులకు పాల్పడ్డ దుండులను కఠినంగా శిక్షించాలి. బాధితులకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
బాధితుల ఆందోళన..
మేం భక్తి పాటలు పెట్టుకుంటే వాళ్లు మాపై దాడి చేశారు. పోలీసులు కూడా వాళ్లవైపే ఉన్నారు. మా ఆయనను పోలీసులు గుంజుకుపోయి కొట్టారు. పోలీసులు కూడా వాళ్లకే వత్తాసు పలుకుతున్నరు. మాకు ముందు వెనుకా ఎవరూ లేరు. మీరు(మీడియా) కూడా న్యాయం వైపు లేకపోతే ఇక మమ్ముల్ని కాపాడేదెవరు అని స్థానికులు వాపోయారు? ఇక గర్భిణీ మహిళ మాట్లాడుతూ.. మేం మా ఇంటి వద్ద ఉంటే మీ స్టేట్ మెంట్ తీసుకోవాలంటూ బలవంతంగా పోలీసులు మమ్ముల్ని సంతకాలు చేయించుకోవాలని చూశారు. మేం సంతకాలు పెట్టకపోతే మమ్ముల్ని బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించుకుని గర్బిణీ అని కూడా చూడకుండా స్టేషన్ లో కూర్చోబెట్టారు. విచక్షణారహితంగా కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.