Balineni Srinivasa Reddy: మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసినా.. చేయకపోయినా.. 28 వేల మందికి పట్టాలు పంపిణీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు. అర్హులకు భూమి పట్టాలు ఇచ్చేందుకు తాను ఒక్కో రైతు నుంచి రూ.8లక్షలు తీసుకున్నట్లు కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తనను రాజకీయంగా ఎదురుకోలేక.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు.
ALSO READ: త్వరలో ఇంటిటి సర్వే.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
నేను రాజీనామా చేస్తా..
తాను నిజంగా రైతుల దగ్గర నుంచి రూ.8లక్షలు లంచంగా తీసుకున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి రాజకీయాలు దూరంగా ఉంటానని అన్నారు. తాను అవినీతి చేసినట్లు నిరూపించే వాళ్లకు ఇది మంచి అవకాశం అని అన్నారు. పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని కొందరు హైకోర్టులో పిల్ వేశారని అన్నారు. వాళ్లకు ప్రజలే త్వరలో బుద్ది చెబుతారని పేర్కొన్నారు.
175కి 175 ఫిక్స్..
ఈ నెల 20న అర్హులకు సీఎం జగన్ చేతుల మీదిగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే బాలినేని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్ వైపే ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా వైసీపీదే జోరు అని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు ,జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. తాను వైసీపీలో కొనసాగనున్నట్లు తేల్చి చెప్పారు.
ASLO READ: కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్.. కారణం అదేనా..
DO WATCH: