Balineni : వైసీపీ నుంచి బాలినేని జంపింగ్ జంపాంగా..? ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తుంది.అదే జరిగితే తాను పార్టీ వీడటానికైనా సిద్దమని వైసీపీ పెద్దలకు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. By Bhavana 15 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి Balineni In Trouble : వైసీపీ (YCP) శ్రేణుల్లో తీవ్ర నిస్తేజం కనిపిస్తుంది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకుడే మోహం చాటేసి తిరుగుతుండడంతో పార్టీ విడిచి పెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒంగోలు కార్పొరేటర్లు... చాలా మంది పార్టీని విడిచిపెట్టారు. ఈ క్రమంలోనే పార్టీ జిల్లా బాధ్యతలనూ ఎంపీగా ఓటమి పాలైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి కి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారీ ఓటమి తరువాత మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy).. సోమవారం తొలిసారిగా నగరానికి వస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలను ఆయన ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే నాలుగేళ్ల నుంచి క్యాడర్ కు బాలినేని అందుబాటులో లేరు. ఒంగోలు (Ongole) వచ్చినప్పటికీ కూడా పార్టీలో అంత చురుకుగా పాల్గొనలేదు. అప్పటితో పోలిస్తే ఈ ఎన్నికల్లో మరింత ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల తరువాత పార్టీ అధ్యక్షుడు జగన్ (YS Jagan) నిర్వహించిన సమీక్షలకు దూరంగా ఉన్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ తో కార్పొరేటర్లు అంతా టచ్ లో ఉన్నారు. దీంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో టీడీపీ (TDP) లో చేరేందుకు రంగం సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఒంగోలు కార్పొరేషన్ ను చేజిక్కించుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తుంది. అదే జరిగితే తాను పార్టీ వీడటానికైనా సిద్దమని వైసీపీ పెద్దలకు బాలినేని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాలినేనిని సజ్జల బుజ్జగించేందుకు యత్నం చేస్తున్నట్లు ప్రచారం. Also read: వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సీ..! #ongole #ycp #ys-jagan #tdp #sajjala #balineni-srinivasa-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి