Blakrishna: ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మేము కవలలమే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వేడుకలో బాలయ్య!

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ పై బాలకృష్ణ ప్రశంసలు కురిపించాడు. విశ్వక్ కూడా తనలాగే సినిమాకోసం తపనపడతాడని, 'ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్నూ, విశ్వక్‌ను కవలలే అంటారు' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

New Update
Blakrishna: ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మేము కవలలమే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వేడుకలో బాలయ్య!

Gangs of Godavari: టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ పై సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసలు కురిపించాడు. విష్వక్‌సేన్‌ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన బాలయ్య.. విశ్వక్ తనకు సోదరుడితో సమానమన్నాడు. విశ్వక్ కు సినిమా అంటే తపన. ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడు. తమ ఇద్దరిలో ఉన్న సారూప్యం అదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కొంతమందితోనే నేను సన్నిహితంగా ఉంటా..
‘ధన్యమైన జన్మనిచ్చి ప్రేక్షకులందరి హృదయాల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు. విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి నందమూరి తారక రామారావుకు ఘన నివాళులర్పించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్నూ, విశ్వక్‌ను కవలలే అంటారు. కొంతమందితోనే నేను సన్నిహితంగా ఉంటా. అందులో విష్వక్‌ ఒకడు. నాలాగే ఉడుకురక్తం, దూకుడు ఉన్న వ్యక్తి. సినిమా సినిమాకీ, పాత్రల మధ్య కొత్తదనం ప్రదర్శిస్తూ ప్రయాణం చేస్తున్నాడు. గోదావరి జిల్లాల నేపథ్యంలో నేనూ సినిమాలు చేశా. గోదావరి అందాలతోపాటు, ఎంతో కిక్‌ ఇచ్చేలా ఉంది ఈ సినిమా ట్రైలర్‌. ప్రేక్షకులకు ముందుగా మనం కొత్తదనం అందించాలి. అప్పుడే వాళ్లు ఆదరిస్తారు. మా అబ్బాయి మోక్షు కూడా పరిశ్రమకి రావాలి. తనని కూడా విష్వక్, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువతరాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతుంటా. నటులు నిత్యావసర వస్తువుల్లా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి. నాన్న నుంచి అదే నేర్చుకున్నా. మోక్షు కూడా అదే అనుసరిస్తాడు. మంచి సినిమాలు చేసిన దర్శకుడు కృష్ణచైతన్య, యువన్‌ శంకర్‌ రాజా, అంజలి, నేహా.. ఇలా ప్రతి ఒక్కరికీ ఈ సినిమా గుర్తుండిపోతుంది. తపన ఉన్న నిర్మాత వంశీ. మరో మంచి కలయిక ఉంది. త్వరలోనే దాన్ని ప్రకటించబోతున్నాం’ అని చెప్పారు.

నోట్లోకి ఐదు వేళ్లు వెళుతున్నాయంటే ఆ సినిమానే కారణం..
ఈ సినిమా కోసం ఫైట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు రోడ్డుపైన పడిపోయా. దేవుడి దయవల్ల ఏమీ కాలేదు కానీ, ఆ సమయంలో నాకేమైందని చాలామంది టెన్షన్‌ పడ్డారని విశ్వక్ సేన్ చెప్పాడు. నాకు దెబ్బ తగిలిందని తెలిసి బాలయ్య సర్‌ ఫోన్‌ చేసి మాట్లాడినప్పుడు నా కళ్లల్లో నీళ్లొచ్చాయి. కుటుంబం తర్వాత అంత ప్రేమ చూపించారు. తెలుగోడి ఆత్మగౌరవం ఎన్టీఆర్‌ అని రాసి వున్న ఓ పెయింటింగ్‌ నేపథ్యంలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టాం. ఆయన జయంతి రోజే ఈ వేడుక జరుగుతోంది. ఐదేళ్ల కిందట ‘ఫలక్‌నుమా దాస్‌’ విడుదలైంది. నోట్లోకి ఐదు వేళ్లు వెళుతున్నాయంటే ఆ సినిమానే కారణం. ఈ పొగరుతో ఉంటే తీసేస్తారు, తొక్కేస్తారు అన్నారు అప్పట్లో. ఏ రోజూ నా క్యారెక్టర్‌ని చంపుకోలేదు. ఏదైతే తగ్గించుకోమన్నారో అది నచ్చే నాకు అభిమానులయ్యారు. ఈ ఐదేళ్లు నన్ను సపోర్ట్‌ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక నేహాశెట్టి, అంజలి కథానాయికలు. కాగా సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సినిమాను నిర్మించారు.

Advertisment
తాజా కథనాలు