Balakrishna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో చెప్పేసిన బాలయ్య!

విశ్వక్‌సేన్‌ నటించిన 'గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలకృష్ణ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో బాలయ్య కొడుకు సినీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Balakrishna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో చెప్పేసిన బాలయ్య!
New Update

Balakrishna Gives Clarity On Mokshagna Movie Entry : బాలయ్య (Balakrishna) తనయుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత మూడేళ్ళుగా మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటిదాకా మోక్షు ఎంట్రీపై అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో మునిగిపోయారు. ఇలాంటి తరుణంలో మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి స్వయంగా బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.

కొడుకు ఎంట్రీపై బాలయ్య క్లారిటీ

విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) నటించిన 'గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలకృష్ణ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో బాలయ్య కొడుకు సినీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు బాలయ్య మాట్లాడుతూ.." ఇండస్ట్రీలో నాకు మంచి అనుబంధం ఉన్న కొద్దిమందిలో విశ్వక్‌సేన్‌ ఒకరు. ప్రేక్షకులకు ఏదైనా కొత్తదనంతో కూడిన వినోదం అందించాలని ప్రయత్నిస్తుంటాడు.

Also Read : ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 81 వ జయంతి వేడుకులు.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఘట్టమనేని ఫ్యామిలీ!

గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని పంచుతుందని విశ్వసిస్తున్నా.ఇండస్ట్రీకి త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విశ్వక్‌సేన్‌, సిద్దు జొన్నలగడ్డ, అడివిశేష్‌ లాంటి యాక్టర్లను స్పూర్తిగా తీసుకోవాలని నేనెప్పుడూ మోక్షజ్ఞకు చెప్తుంటా.

ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా నవతరం కథలను అందించేలా యాక్టర్లు తమను తాము మార్చుకోవాలి. ప్రేక్షకులు త్వరలోనే విశ్వక్‌సేన్‌, బాలకృష్ణ కాంబోను చూస్తారు. దీని ప్రకటన కూడా త్వరలో ఉండబోతుందని" అని చెప్పి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాడు. ఇక బాలయ్య చెప్పిన దాన్ని బట్టి మోక్షగా సినీ ఎంట్రీ ఇదే ఏడాదిలో ఉండబోతుందని అర్థమవుతుంది.

#tollywood #balakrishna #mokshagna-nandamuri #cine-entry
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe