Balakrishna : 'నా అల్లుడి మీద ఈగ వాలకుండా చూసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు'
'10 లక్షల కోట్ల అప్పు.. అభివృద్ధి సున్నా .. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' అని ఫైర్ అయ్యారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగానే నా అల్లుడు నారా లోకేష్ మీద ఈగ వాలకుండా చూసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
Balakrishna Comments : విజయనగరం(Vizianagaram) జిల్లా పోలిపల్లి వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన యువగళం నవశకం సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసిపికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇది యువగళం ముగింపు సభ కాదని.. నవతరం రాజకీయాలకు ఆరంభమని అని అన్నారు. నా అల్లుడు నారా లోకేష్(Nara Lokesh) మీద ఈగ వాలకుండా చూసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు అంటూ నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి సీఎం జగన్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందని మండిపడ్డారు. ఏపీకి రాజధాని లేకుండా చేసిన చెత్త ప్రభుత్వం వైసిపి ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి సాగులో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రాన్ని సైకో పరిపాలన చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని ఈ సారి జగన్ ప్రభుత్వంను గద్దె దింపాల్సిందేనని అన్నారు. ' 10 లక్షల కోట్ల అప్పు.. అభివృద్ధి సున్నా .. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ? ' అని ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై ప్రసంశలు కురిపించారు. నటన కేవలం సినిమాలకే పరిమితం కాదని..పవన్ కళ్యాణ్ ను సినిమాల్లో కంటే ప్రజల్లోనే ఎక్కువగా చూస్తున్నామని కొనియాడారు. జనసేనాని ప్రజల కోసం పోరాడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Also Read: అప్పుడెక్కడికి వెళ్లారు మీరంతా.. మీడియాకు రాహుల్ కౌంటర్..