Watch Video: వివాదంలో బజరంగ్ పూనియా.. జాతీయ జెండాను అగౌరవపరిచాడంటూ విమర్శలు శనివారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వినేశ్ ఫొగాట్‌కు స్వాగతం పలికేందుకు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు వచ్చారు. వినేశ్ ఎక్కిన కారుపై జాతీయ జెండా గుర్తులు ఉన్న పోస్టర్‌ను అలకరించారు. దానిపై బజరంగ్ పూనియా నిల్చోవడంతో అతడిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు, By B Aravind 17 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌లో అనర్హత వేటుకు గురైన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం భారత్‌కు తిరిగివచ్చారు. ఈవెంట్ నుంచి ఆమె డిస్క్వాలిఫై అయ్యాక సిల్వర్ మెడల్ కోసం కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)లో అప్పీల్ చేసుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే వినేశ్.. ఆగస్టు 17న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆమెను స్వాగతం పలికేందుకు రేజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాతో పాటు మరికొంత మంది ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు. వినేశ్ ఫొగాట్‌కు గ్రాండ్‌గా స్వాగతం పలికిన అనంతరం ఆమెను కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. అయితే ఆ కారుపై ఉన్న మరో రెజ్లర్ బజరంగ్ పూనియా చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఆ కారుపై అలంకరించిన ఓ పోస్టర్లో జాతీయ జెండా గుర్తులు ఉన్నాయి. అయితే జాతీయ జెండా గుర్తులపై బజరంగ్ పూనియా నిల్చొని మీడియాను, అక్కడికి వచ్చిన వాళ్లను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు. మీడియాను ఓవైపు రావాలంటూ చెప్పాడు. వారి మైకులు తీసుకొని వినేశ్ ఫొగాట్ దగ్గర పెట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో నెటిజన్లు బజరంగ్ పూనియాపై పలువురు విమర్శలు చేస్తున్నారు. జాతీయ జెండా గుర్తులు ఉన్న పోస్టర్‌పై నిల్చొని.. జెండాను అగౌరవపరిచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అతను కావాలని అలా నిల్చోలేదని.. అక్కడున్న జనాలను, మీడియాకు కంట్రోల్ చేసేందుకు యత్నించగా అలా పొరపాటు జరిగిందని చెబుతున్నారు. So @BajrangPunia standing on ‘Tiranga’ Fun fact you can’t criticise him because he has represented India in olympic games so he has freedom to do all this. pic.twitter.com/FNDniKuyXI — BALA (@erbmjha) August 17, 2024 #telugu-news #vinesh-phogat #bajrang-punia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి