రాహుల్ గాంధీకి బెయిల్ - బీజేపీ కేసులో బెంగళూరు కోర్టు ఆదేశం! గత కర్ణాటక ఎన్నికల సమయంలో BJP పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అప్పటి ప్రభుత్వం కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసింది.ఇప్పుడు ఆ కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. By Durga Rao 07 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లపై బీజేపీ ప్రభుత్వం పరువునష్టం కేసు దాఖలు చేసింది. ఈ పరువు నష్టం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు ఇప్పటికే బెయిల్ మంజూరు కాగా, ఈ కేసు విచారణకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ బెంగళూరు వచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆయనకు స్వాగతం పలికారు. రాహుల్ గాంధీని బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తులు ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ఇదే కేసులో రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని బీజేపీ కర్ణాటక విభాగం జూన్ 1న డిమాండ్ చేసింది. అయితే కర్ణాటకలో విడుదల చేసిన పార్టీ ప్రకటనలతో రాహుల్ గాంధీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వాదించింది. జూన్ 1 న రాహుల్ గాంధీ హాజరుకాకపోవటంతో.. నేడు ఆయనతకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. #congress #rahul-gandhi #high-court #bengaluru #rahul మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి